ఫోన్ స్మార్టే...ఫలితాలే హార్డ్!
స్మార్ట్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపటం బాగానే ఉంటుంది కానీ, దాని ఫలితాలే మరీ తీవ్రంగా ఉంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వాడేవారు ఏకాగ్రతాలోపం, ఆత్రుతలతో కూడిన అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్‌డి)కి గురవుతారని పరిశోధకులు అంటున్నారు. 95శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తాము నలుగురిలో ఉన్నా ఫోన్‌ని వాడుతూనే ఉన్నామని చెప్పారు. ప్రతిపదిమందిలో ఏడుగురు తమ జీవితభాగస్వామితో సన్నిహితంగా ఉన్నపుడు కూడా ఫోన్‌ని చెక్‌చేసుకుంటామని చెప్పారు. స్మార్ట్‌ఫోను వినియోగదారులు రోజులో రెండుగంటలు పూర్తిగా ఫోన్‌కే […]
స్మార్ట్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపటం బాగానే ఉంటుంది కానీ, దాని ఫలితాలే మరీ తీవ్రంగా ఉంటున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువగా వాడేవారు ఏకాగ్రతాలోపం, ఆత్రుతలతో కూడిన అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్‌డి)కి గురవుతారని పరిశోధకులు అంటున్నారు. 95శాతం మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తాము నలుగురిలో ఉన్నా ఫోన్‌ని వాడుతూనే ఉన్నామని చెప్పారు. ప్రతిపదిమందిలో ఏడుగురు తమ జీవితభాగస్వామితో సన్నిహితంగా ఉన్నపుడు కూడా ఫోన్‌ని చెక్‌చేసుకుంటామని చెప్పారు. స్మార్ట్‌ఫోను వినియోగదారులు రోజులో రెండుగంటలు పూర్తిగా ఫోన్‌కే ఖర్చుచేస్తున్నారని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన అమెరికా, వర్జీనియా యూనివర్శిటీకి చెందిన కొస్టాడిన్ కుష్‌లెవ్ తెలిపారు.
స్మార్ట్ ఫోన్ వలన కలుగుతున్న అంతరాయాలు వాడకం దారుల్లో తీవ్రమైన ఏకాగ్రతా భంగానికి, విపరీతమైన ఆందోళనకూ కారణమవుతున్నాయని కెనడాలోని బ్రిటీష్ కొలంబియా యూనివర్శిటీలో 221మంది విద్యార్థులపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వీరికి ఒక వారం పాటు ఫోన్ వారి దగ్గరే ఉండేలా చేసి, కాల్స్, మెసేజ్‌ల ద్వారా విపరీతంగా అంతరాయం కలిగేలా చేశారు. మరోవారం వారికి ఫోన్‌ని దూరంగా ఉంచి అంతరాయం లేకుండా చేశారు. రెండువారాల్లో వారికి కొన్ని ప్రశ్నలు ఇచ్చి జవాబుల ద్వారా వారి మానసిక స్థితిని గమనించారు. ఫోన్లు దగ్గరగా ఉన్న వారంలో తాము విపరీతమైన విసుగు, చిరాకులకు గురయ్యామని, ఏకాగ్రత సాధ్యం కాలేదని, ఆత్రుతకి, యాంగ్జయిటీ వేధించాయని పార్టిసిపెంట్లు చెప్పారు. అంతకుముందు ఎడిహెచ్‌డికి సంబంధించిన లక్షణాలు లేనివారు కూడా స్మార్ట్ ఫోన్ వినియోగం వలన వాటికి గురవుతున్నారని కుష్‌లెవ్ అన్నారు. వీరు త్వరగా బోర్‌కి గురవుతున్నారని, పనిలో ఏకాగ్రతని చూపలేకపోతున్నారని, కాళ్లుచేతులు కదపటం, స్థిమితంగా స్థిరంగా కూర్చోలేకపోవటం లాంటి లక్షణాలు పెరుగుతున్నాయని, ప్రశాంతమైన మనసుతో చేయాల్సిన పనులను చేయలేకపోతున్నారని, అసహనానికి గురవుతున్నారని తేలింది.