కొత్తపల్లికి బాబు ఫోన్.. క్లారిటీ ఇచ్చిన సుబ్బారాయుడు
చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ వైసీపీ ఎమ్మెల్యేలపైనే కాదు ఆ పార్టీ ముఖ్యనాయకుల మీద ప్రయోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడికి నేరుగా చంద్రబాబే ఫోన్ చేశారు. టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివారం రాత్రి చాలాసేపు ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నారు. చంద్రబాబు హామీతో కొత్త పల్లి సుబ్బారాయుడు కూడా తలూపారని చెబుతున్నారు. అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలులో టీడీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని వాటిని చూసిన తర్వాత తనకు కూడా టీడీపీలోకి రావాలనిపిస్తోందని సుబ్బారాయుడు చెప్పారు. […]
చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ వైసీపీ ఎమ్మెల్యేలపైనే కాదు ఆ పార్టీ ముఖ్యనాయకుల మీద ప్రయోగిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడికి నేరుగా చంద్రబాబే ఫోన్ చేశారు. టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆదివారం రాత్రి చాలాసేపు ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్నారు.
చంద్రబాబు హామీతో కొత్త పల్లి సుబ్బారాయుడు కూడా తలూపారని చెబుతున్నారు. అభివృధ్ధి, సంక్షేమ పథకాల అమలులో టీడీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని వాటిని చూసిన తర్వాత తనకు కూడా టీడీపీలోకి రావాలనిపిస్తోందని సుబ్బారాయుడు చెప్పారు. దీంతో కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. తాను కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్తున్నానని తిరిగి వచ్చాక వ్యక్తిగతంగా కలుద్దామని సుబ్బారాయుడికి చంద్రబాబు చెప్పారు.
మంచి ముహూర్తం చూసుకుని టీడీపీలో చేరుతానని కొత్త పల్లి చెప్పారు. కొత్తపల్లి గతంలో టీడీపీలోనే ఉండేవారు. చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగానూ పనిచేశారు. సుబ్బారాయుడి రాకపై నర్సాపురం ఎమ్మెల్యే మాధవనాయుడితో చంద్రబాబు మాట్లాడారు. కొత్తపల్లిని టీడీపీలోకి తీసుకుంటున్నామని తెలిపారు. కొత్తపల్లితో కలిసి పనిచేయాలని సూచించారు.
మరో వైపు కొత్తపల్లితో మాట్లాడేందుకు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పిల్లిసుభాష్ చంద్రబోస్ ప్రయత్నించారు. అయినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఆదివారం నుంచి ఫోన్ లో ట్రై చేస్తున్నా సుబ్బారాయుడు అందుబాటులోకి రావడం లేదని బోస్ చెప్పారు. ఒకవేళ సుబ్బారాయుడు టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకుని ఉంటే అది చాలా దురదృష్టకరమన్నారు.
click on Image to Read: