అన్నంత పని చేశారు... ప్ర‌తిప‌క్షం అనుమానాలను నిజం చేసిన సీఎం

ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు తాను చేయాలనుకున్నది చేసేస్తున్నారు. ప్ర‌తిప‌క్షం ఆరోపణలను నిజం చేస్తూ మజ్జిగ‌ సరఫరా పథకంలో నిర్ణయం తీసుకున్నారు. వేసవి వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు ఉచితంగా మజ్జిగ‌ సరఫరా చేస్తామని ఏప్రిల్ 17న కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు ప్రకటించారు. జిల్లాకు రూ. 3కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రకటనపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా హెరిటేజ్ లో మిగిలినపోయిన పాలుపెరుగు అమ్ముకునేందుకు చంద్రబాబు మజ్జిగ […]

Advertisement
Update:2016-05-08 10:29 IST

ఎన్ని విమర్శలు వచ్చినా చంద్రబాబు తాను చేయాలనుకున్నది చేసేస్తున్నారు. ప్ర‌తిప‌క్షం ఆరోపణలను నిజం చేస్తూ మజ్జిగ‌ సరఫరా పథకంలో నిర్ణయం తీసుకున్నారు. వేసవి వేడిమి నుంచి ప్రజలను కాపాడేందుకు ఉచితంగా మజ్జిగ‌ సరఫరా చేస్తామని ఏప్రిల్ 17న కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు ప్రకటించారు. జిల్లాకు రూ. 3కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రకటనపై అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.

కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా హెరిటేజ్ లో మిగిలినపోయిన పాలుపెరుగు అమ్ముకునేందుకు చంద్రబాబు మజ్జిగ ఎత్తు వేశారని ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. అయితే ఈ స్థాయిలో విమర్శలు రావడంతో మజ్జిగ సరఫరాను తప్పనిసరిగా సహకార సంఘాల ఆధ్వర్యంలోని డెయిరీలకు అప్పగిస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం వెనక్కు తగ్గలేదు. తన సొంత కంపెనీ హెరిటేజ్ కే అప్పగించారు. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ నుంచే మజ్జిగ కొనుగోలు చేయాలంటూ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలను ఉత్తర్వుల రూపంలో జారీ చేశారు.

తక్కువ ధరకు మజ్జిగ సరఫరా చేసేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చినా చంద్రబాబు మాత్రం లెక్కచేయలేదు. మొత్తం మీద మజ్జిగ పథకం ద్వారా తన కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ కు 39 కోట్ల విలువైన మజ్జిన కాంట్రాక్టును చంద్రబాబు అప్పగించుకున్నారు. గత రెండేళ్లుగా పండుగల సమయంలో ఇస్తున్న చంద్రన్న కానుకల్లోనూ నెయ్యిని హెరిటేజ్ నుంచే భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పథకాలను చంద్రబాబు తన హెరిటేజ్ కు లాభాలు తెచ్చేందుకు ప్రవేశపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

click to read-

Tags:    
Advertisement

Similar News