"ఒకరికి పుట్టిన బిడ్డను తనదని చెప్పుకోవడమే…"
తాను టీడీపీలోకి చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను టీడీపీలోకి రావాల్సిందిగా పిలిచే ధైర్యం ఏ నాయకుడికైనా ఉందా అని ప్రశ్నించారు. కొందరు పనిగట్టుకుని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారేలా చేసే ధైర్యం ఏ నాయకుడికి లేదన్నారు. వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు డబ్బు పెట్టి , మంత్రి పదవులు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అలా చేయడం అంటే ”ఒకరికి […]
తాను టీడీపీలోకి చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను టీడీపీలోకి రావాల్సిందిగా పిలిచే ధైర్యం ఏ నాయకుడికైనా ఉందా అని ప్రశ్నించారు. కొందరు పనిగట్టుకుని ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారేలా చేసే ధైర్యం ఏ నాయకుడికి లేదన్నారు.
వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను చంద్రబాబు డబ్బు పెట్టి , మంత్రి పదవులు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. అలా చేయడం అంటే ”ఒకరికి పుట్టిన బిడ్డను తనదని” చెప్పుకోవడమేనని హేళన చేశారు. వైసీపీని నిర్వీర్యం చేయాలనే చంద్రబాబు ఇలాంటి ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని వీడిన ఎమ్మెల్యేలు జగన్ పై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.
జగన్ ప్రజల మనిషి అని .. నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకనే చంద్రబాబు ఇలా ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారని విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పటికీ తాను జగన్ తోనే ఉంటానని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చిన విశ్వేశ్వరరెడ్డికి తొలి నుంచి కూడా నిజాయితీపరుడన్న పేరు ఉంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పై ఎమ్మెల్యేగా గెలిపొందారు.
Click on Image to Read: