ఒక్క సిగరెట్టు...11 నిముషాల ఆయుష్షు!
తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే ఎంతో మేలు చేసే ఆరోగ్య సూత్రాలివి- -ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గానీ, రాత్రి డిన్నర్‌గానీ బయట తినే అలవాటు ఉన్నవారికి, అలా తిననివారికంటే బరువు పెరిగే రిస్క్ రెండింతలు ఉంటుంది. -వందసార్లు నవ్వటం అనేది స్టేషనరీ సైకిల్‌మీద పావుగంట వ్యాయామం చేయటంతో సమానం -రోజులో మూడుగంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారు తమ జీవితకాలాన్ని ఓ రెండేళ్లు తగ్గించుకుని అంచనా వేసుకోవాల్సిందే. -పొగాకు, ఆల్కహాల్ అలవాట్లు లేకుండా, మంచి ఆహారం, వ్యాయామం ఉంటే […]
తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే ఎంతో మేలు చేసే ఆరోగ్య సూత్రాలివి-
-ప్రతిరోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గానీ, రాత్రి డిన్నర్‌గానీ బయట తినే అలవాటు ఉన్నవారికి, అలా తిననివారికంటే బరువు పెరిగే రిస్క్ రెండింతలు ఉంటుంది.
-వందసార్లు నవ్వటం అనేది స్టేషనరీ సైకిల్‌మీద పావుగంట వ్యాయామం చేయటంతో సమానం
-రోజులో మూడుగంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారు తమ జీవితకాలాన్ని ఓ రెండేళ్లు తగ్గించుకుని అంచనా వేసుకోవాల్సిందే.
-పొగాకు, ఆల్కహాల్ అలవాట్లు లేకుండా, మంచి ఆహారం, వ్యాయామం ఉంటే 30శాతం క్యాన్సర్లను నిరోధించవచ్చు.
-రోజుకి ఏడుగంటలకంటే తక్కువ నిద్రపోతున్నవారు తమ జీవితకాలాన్ని తగ్గించుకుంటున్నట్టే లెక్క.
-మీరు తాగుతున్న ప్రతి సిగరెట్ మీ జీవితకాలంనుండి 11 నిముషాలను తగ్గిస్తుందని అంచనావేసుకోవాలి.
-పొగతాగటం వలన లంగ్ క్యాన్సర్‌కి గురవుతున్న వారికంటే నీడలో ఉంటూ కూడా సూర్యరశ్మి వలన చర్మ క్యాన్సర్‌కి గురవుతున్న వారు ఎక్కువ.
-వాకింగ్ లాంటి వ్యాయామాలు రొమ్ముక్యాన్సర్ రిస్క్‌ని 25శాతం తగ్గిస్తాయి.
-భార్య గర్భవతి అయ్యే సమయంలో భర్త తీసుకునే ఆహారం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంమీద చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
-తీవ్రమైన డిప్రెషన్‌కి గురయినవారి శరీర కణాల్లో ఏజింగ్ ప్రాసెస్ ఎక్కువగా జరిగి త్వరగా వయసుమీరిన లక్షణాలు బయటపడతాయి.
-40 ఏళ్ల క్రితం నాటి కోళ్లలో కంటే నేటి కోళ్లలో 266శాతం కొవ్వు ఎక్కువగా ఉంది.
-ఎవరైతే ఎక్కువగా ఇతరులమీద ఫిర్యాదులు చేస్తారో వారిలో టెన్షన్లు పోయి, రోగనిరోధక శక్తి పెరిగి ఎక్కువ కాలం జీవిస్తారు.