48 డిగ్రీలా స్వామీ.. అంతా ఆ మ‌హానుభావుని పుణ్య‌మే

కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఖాళీ బిందెలతో బైఠాయించారు. సీమలో కరువు విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు. అదేంటో గానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కూడా వెంట వస్తోందన్నారు. చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లల్లా రాష్ట్రం మీద పడుతున్నాయని అన్నారు. చంద్రబాబు ఎక్కడ […]

Advertisement
Update:2016-05-02 08:23 IST

కరువు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల ముందు ఖాళీ బిందెలతో బైఠాయించారు. సీమలో కరువు విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి మండిపడ్డారు. అదేంటో గానీ మొదటి నుంచి కూడా చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు కూడా వెంట వస్తోందన్నారు. చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లల్లా రాష్ట్రం మీద పడుతున్నాయని అన్నారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ జనం అల్లాడిపోతున్నారని విమర్శించారు. నరకంలో కూడా జనం బతకవచ్చని చంద్రబాబు పాలన చూస్తుంటే అర్థమవుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎప్పుడూ చూడలేదన్నారు.. కానీ ఆ మహానుభావుడు (చంద్రబాబు) వచ్చారు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఇదంతా చంద్రబాబు పుణ్యమేనని అన్నారు. చివరకు ఎండలు పేరు చెప్పి హెరిటేజ్ మజ్జిగను అమ్ముకునే స్థాయికి చంద్రబాబు దిగజారారని చెవిరెడ్డి విమర్శించారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News