పీజేఆర్ చావుకు వైఎస్సే కార‌ణమట

కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. దిగువ‌కు నీరు రాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్ట్ క‌డుతోందని అందుకు నిర‌స‌నగా క‌ర్నూలులో మూడు రోజుల నిరాహార‌దీక్ష‌కు జ‌గ‌న్ సిద్ధ‌మైన నేప‌థ్యంలో వీహెచ్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ కుటుంబం అంటే తొలి నుంచి కస్సుమ‌ని లేస్తున్న వీహెచ్ ఈసారి పెద్ద నింద వేశారు. మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ చ‌నిపోవ‌డానికి కార‌ణం వైఎస్సేన‌ని ఆరోపించారు. రాయ‌ల‌సీమ‌కు నీరు తీసుకెళ్లే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్కి వ్య‌తిరేకంగా పోరాడిన పీజేఆర్‌ను వైఎస్ […]

Advertisement
Update:2016-05-01 11:58 IST

కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ మ‌రోసారి వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. దిగువ‌కు నీరు రాకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్ట్ క‌డుతోందని అందుకు నిర‌స‌నగా క‌ర్నూలులో మూడు రోజుల నిరాహార‌దీక్ష‌కు జ‌గ‌న్ సిద్ధ‌మైన నేప‌థ్యంలో వీహెచ్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ కుటుంబం అంటే తొలి నుంచి కస్సుమ‌ని లేస్తున్న వీహెచ్ ఈసారి పెద్ద నింద వేశారు. మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ చ‌నిపోవ‌డానికి కార‌ణం వైఎస్సేన‌ని ఆరోపించారు.

రాయ‌ల‌సీమ‌కు నీరు తీసుకెళ్లే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్కి వ్య‌తిరేకంగా పోరాడిన పీజేఆర్‌ను వైఎస్ మాన‌సికంగా వేధించార‌ని వీహెచ్ అన్నారు. అందుకే ఆయ‌న చ‌నిపోయార‌ని ఆరోపించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వైఎస్ వ‌ల్ల రాలేద‌ని చంద్ర‌బాబుపై వ్య‌తిరేక‌త వ‌ల్ల వ‌చ్చింద‌న్నారు. నీటి కోసం జగన్ దీక్ష చేయడం విడ్డూరమని, దిగువ ప్రాంతాలకు నష్టం జరుగుతుందని మోసలి కన్నీరు కారుస్తున్నారని వీహెచ్ మండిప‌డ్డారు.

ఫిరాయింపుల‌ను తొలుత ప్రోత్స‌హించింది వైఎస్సేన‌ని వీహెచ్ రుస‌రుస‌లాడారు. మొత్తం మీద జ‌గ‌న్ దీక్ష‌పై అప్పుడే తీవ్ర‌స్థాయిలో దాడి మొద‌లైన‌ట్టు క‌నిపిస్తోంది. టీ మంత్రి హ‌రీష్ రావు కూడా వెయ్యి మంది జ‌గ‌న్‌లు వ‌చ్చినా ప్రాజెక్టులు క‌ట్టితీరుతామ‌న్నారు. అయితే స్పందించాల్సిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ ప్రాజెక్టుల‌పై నోరు విప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News