ఒక పార్టీలో గెలిచి ఇంకొపార్టీకి మాట్లాడుతున్నావ్... సిగ్గులేదా? దమ్ముంటే రా?
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో చాలా మంది వీలైనంత వరకు మీడియాకు దూరంగానే బతుకుతున్నారు. కానీ జలీల్ ఖాన్ మాత్రం టీడీపీ తరపున ధీటుగా టీవి చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకహోదా అంశంపై ఒక టీవీ ఛానల్ చర్చ నిర్వహించగా జలీల్ ఖాన్ బీజేపీపై విరుచుకుపడ్డారు. అయితే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జలీల్ ఖాన్ పై ఊహించని రితీలో ఎదురుదాడి చేశారు. తొలుత మాట్లాడిన జలీల్ ఖాన్… బీజేపీ విషయంలో తమ పార్టీ( టీడీపీ) […]
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో చాలా మంది వీలైనంత వరకు మీడియాకు దూరంగానే బతుకుతున్నారు. కానీ జలీల్ ఖాన్ మాత్రం టీడీపీ తరపున ధీటుగా టీవి చర్చల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకహోదా అంశంపై ఒక టీవీ ఛానల్ చర్చ నిర్వహించగా జలీల్ ఖాన్ బీజేపీపై విరుచుకుపడ్డారు. అయితే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జలీల్ ఖాన్ పై ఊహించని రితీలో ఎదురుదాడి చేశారు.
తొలుత మాట్లాడిన జలీల్ ఖాన్… బీజేపీ విషయంలో తమ పార్టీ( టీడీపీ) ఎంతో సహనంతో ఉందని చెప్పారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. డైడ్ లైన్ పెట్టి కేంద్రం నుంచి బయటకు వచ్చే ఆలోచన ఉందా అంటే మాత్రం అలాంటిదేమీ లేదని జలీల్ ఖాన్ చెప్పారు. అంతకు ముందు 2019లో బీజేపీని భూస్థాపితం చేస్తామని కూడా జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు.
జలీల్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ఒక పార్టీలో గెలిచి ఇంకొపార్టీలోకి మారిన నీవా నీతులు చెప్పేది అంటూ విరుచుకుపడ్డారు. సిగ్గుశరం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీని భూస్థాపితం చేయడం నీ వల్లే ఏమవుతుంది అని మండిపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రా… ఇద్దరం పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో తేలిపోతుందని వెల్లంపల్లి సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చంద్రబాబు ఎలా అన్నారని వెల్లంపల్లి ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఇస్తే అన్ని జరిగిపోవని చంద్రబాబు ఎలా అన్నారని… దానికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వెళ్లిపోయినా తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తేల్చిచెప్పారు. వెల్లంపల్లి అటాక్ తో జలీల్ ఖాన్ సైలెంట్ అయిపోయారు.
Click on Image to Read: