రోజా కోసం స్పెష‌ల్ టీం...

రోజా అంటే చాలు టీడీపీలోకి ముగ్గురు న‌లుగురు నేత‌లు సింగిల్ లెగ్‌పై లేస్తున్నారు. సాధార‌ణంగా ఒక పార్టీ నుంచి మ‌హిళా నేత విమ‌ర్శ‌లు చేస్తే… అవ‌త‌లి పార్టీ నుంచి కూడా మ‌హిళా నేత‌లే రియాక్ట్ అవుతుంటారు. కానీ టీడీపీ మాత్రం రోజా విష‌యంలో కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్న‌ట్టుగా ఉంది. రోజా ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీని విమ‌ర్శించ‌డం ఆల‌స్యం వెంట‌నే నెల్లూరులో సోమిరెడ్డి, చిత్తూరులో గాలి ముద్దుకృష్ణ‌మ‌, విజ‌య‌వాడ‌లో బొండా ఉమా మెరుపు వేగంతో స్పందిస్తున్నారు. మ‌హిళా నేత […]

Advertisement
Update:2016-04-30 06:09 IST

రోజా అంటే చాలు టీడీపీలోకి ముగ్గురు న‌లుగురు నేత‌లు సింగిల్ లెగ్‌పై లేస్తున్నారు. సాధార‌ణంగా ఒక పార్టీ నుంచి మ‌హిళా నేత విమ‌ర్శ‌లు చేస్తే… అవ‌త‌లి పార్టీ నుంచి కూడా మ‌హిళా నేత‌లే రియాక్ట్ అవుతుంటారు. కానీ టీడీపీ మాత్రం రోజా విష‌యంలో కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్న‌ట్టుగా ఉంది. రోజా ప్రెస్‌మీట్ పెట్టి టీడీపీని విమ‌ర్శించ‌డం ఆల‌స్యం వెంట‌నే నెల్లూరులో సోమిరెడ్డి, చిత్తూరులో గాలి ముద్దుకృష్ణ‌మ‌, విజ‌య‌వాడ‌లో బొండా ఉమా మెరుపు వేగంతో స్పందిస్తున్నారు.

మ‌హిళా నేత అయిన‌ప్ప‌టికీ రోజాను స్థాయి మించే విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఆ మ‌ధ్య టీడీపీలో మ‌గాళ్లు లేక‌నే వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు తీసుకెళ్తున్నార‌ని రోజా విమ‌ర్శించ‌గానే… గాలి ముద్దుకృష్ణ‌మ‌, సోమిరెడ్డి, బొండా ఉమ అంతే స్థాయిలో ప్ర‌తిస్పందించారు. గాలి ముద్దుకృష్ణ‌మ… రోజా టెస్టింగ్ సెంట‌ర్ పెట్టారా? అని ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం కూడా మ‌రోసారి ఈ నేత‌లు రోజాపై విరుచుకుప‌డ్డారు. అయితే రోజా విష‌యంలో ఇలా కొంద‌రు నేత‌లే ఎందుకింత ఉత్సాహం చూపుతున్నార‌ని టీడీపీ నేత‌లు సొంత ఆలోచ‌నలు చేస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం అనిత, పీత‌ల సుజాత లాంటి వారు రోజాకు కౌంట‌ర్ ఇచ్చేవారు. ఇప్పుడు వారు కూడా మౌనంగా ఉంటున్నారు. కానీ పురుష నేత‌లు మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. దీనికి ఒక‌టే కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చంటున్నారు. చంద్ర‌బాబుకు రోజా అంటే బాగా కోపం అని కాబ‌ట్టి రోజాను ఎంత తిడితే అధినేత వ‌ద్ద అన్ని మార్కులు కొట్టేయ‌వ‌చ్చ‌న్న ఉద్దేశంతోనే ఇలా కొంద‌రు టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నార‌ని కొంద‌రు టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. పైగా ఈ ముగ్గురు నేతలు మంత్రి పదవుల కోసం చాలా కాలంగా పోటి పడుతున్నారు వారే. రోజాను తిట్టడం ద్వారా చంద్రబాబు వద్ద బోనస్ పాయింట్లు సాధించవచ్చని వీరు భావిస్తున్నారట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News