నాకు ప్రాణహాని ఉంది…కేంద్ర బలగాలు ఇవ్వండి
కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటి కాలితో లేచే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ నుంచి తన ప్రాణహాని ఉందని వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ఎస్కార్ట్‌తో కూడిన ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ గానీ లేదా కేంద్ర బలగాలతో గానీ రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను జూన్ నెలకు వాయిదా […]
కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటి కాలితో లేచే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్ నుంచి తన ప్రాణహాని ఉందని వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ఎస్కార్ట్‌తో కూడిన ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ గానీ లేదా కేంద్ర బలగాలతో గానీ రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రేవంత్ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను జూన్ నెలకు వాయిదా వేసింది.
చాలాకాలంగా టీఆర్ఎస్, రేవంత్ మధ్య వైరం ఉన్నా.. ఓటుకు నోటు తర్వాత అది మరింత తీవ్ర రూపం దాల్చింది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయించేందుకు ఎమ్మెల్యేలను కొంటూ రెడ్ హ్యాండెండ్ గా రేవంత్ దొరికిపోయారు. స్టింగ్ ఆపరేషన్ లో రేవంత్ తో పాటు చంద్రబాబు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత కేసీఆర్ పై రేవంత్ మరింత తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. ఇటీవల ఆ దూకుడు తగ్గినట్టుగా కనిపించింది. టీఆర్ఎస్, టీడీపీ మధ్య అప్పుడున్నంత వైరం కూడా ఇప్పుడు లేదు. అయినా హఠాత్తుగా కేసీఆర్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.
Click on Image to Read: