సిగ్గులేదు... పెళ్లాలకంటే పదవులే ముఖ్యం
పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారుతున్న వారికి పెళ్లాలకంటే పదవులంటేనే ఎక్కువ ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుదారుల ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల కంటే వారసుల కోసమే ఎక్కువగా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో చంద్రబాబు తదితరులు కొడుకులకు ఆస్తులు, పదవులు కట్టబెట్టడానికే విలువనిస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం వారి స్థాయిని దిగజార్చుకుని పనిచేస్తున్నారని నారాయణ […]
పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారుతున్న వారికి పెళ్లాలకంటే పదవులంటేనే ఎక్కువ ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుదారుల ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలు ప్రజల కంటే వారసుల కోసమే ఎక్కువగా కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో చంద్రబాబు తదితరులు కొడుకులకు ఆస్తులు, పదవులు కట్టబెట్టడానికే విలువనిస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయిలో ఉన్నవారు సైతం వారి స్థాయిని దిగజార్చుకుని పనిచేస్తున్నారని నారాయణ విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్యకు ప్రధాని మోదీ దేవుడిలాకనిపిస్తున్నాడని, ప్రజలకు మాత్రం దెయ్యంలా కనిపిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద కరువు ఈఏడాది వచ్చిందని కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు శూన్యమని విమర్శించారు. తెలంగాణను వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ అందలం ఎక్కించి ఉద్యమకారులను మరిచిపోవడం దారుణమన్నారు.
Click on Image to Read: