ఢిల్లీ పర్యటనకు గైర్హాజరైన ఎమ్మెల్యేలు వీరే!

ఏపీలో సాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై జాతీయ నాయకులకు ఫిర్యాదు చేసేందుకు జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. రాజ్‌నాథ్ సింగ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తదితరులను జగన్ కలవనున్నారు. అయితే జగన్‌ ఢిల్లీ పర్యటనకు కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు మరో ఎనిమిది మంది ఢిల్లీ పర్యటనకు రాలేదు. అయితే వీరిలో కొందరు జగన్‌కు చెప్పే సొంతపనుల మీద వెళ్లినట్టు తెలుస్తోంది.  […]

Advertisement
Update:2016-04-26 04:14 IST

ఏపీలో సాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై జాతీయ నాయకులకు ఫిర్యాదు చేసేందుకు జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. రాజ్‌నాథ్ సింగ్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, శరద్ యాదవ్ తదితరులను జగన్ కలవనున్నారు. అయితే జగన్‌ ఢిల్లీ పర్యటనకు కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు.

ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు మరో ఎనిమిది మంది ఢిల్లీ పర్యటనకు రాలేదు. అయితే వీరిలో కొందరు జగన్‌కు చెప్పే సొంతపనుల మీద వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించేందుకు బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉన్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిలు ఢిల్లీ పర్యటనకు రాలేదు. వీరితో పాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా డుమ్మా కొట్టారు. ఈయనపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు అమర్‌నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు వీదేశీ పర్యటనలో ఉన్నందున ఢిల్లీ పర్యటనకు రాలేకపోయారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి తన సమీప బంధువు మరణం కారణంగా ఆలస్యంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన ద్వారా మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News