భగ్గుమన్న బలరాం... గొట్టిపాటిపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబు నడుపుతున్న ఫిరాయింపు రాజకీయాలు టీడీపీ నేతల్లో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను టీడీపీలోకి చేర్చుకోవడంపైన తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గొట్టిపాటి రాకను టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడలో సీఎంను కలిసి తన అభ్యంతరం వ్యక్తం చేశారు. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రవికుమార్ రాకను టీడీపీ శ్రేణులు అంగీకరించబోవని వెల్లడించారు. తన కుమారుడితో పాటు టీడీపీ కార్యకర్తలతో కలిసి సీఎం వద్దకు […]
చంద్రబాబు నడుపుతున్న ఫిరాయింపు రాజకీయాలు టీడీపీ నేతల్లో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను టీడీపీలోకి చేర్చుకోవడంపైన తీవ్ర వ్యతిరేకత వస్తోంది. గొట్టిపాటి రాకను టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం తీవ్రంగా వ్యతిరేకించారు. విజయవాడలో సీఎంను కలిసి తన అభ్యంతరం వ్యక్తం చేశారు. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రవికుమార్ రాకను టీడీపీ శ్రేణులు అంగీకరించబోవని వెల్లడించారు. తన కుమారుడితో పాటు టీడీపీ కార్యకర్తలతో కలిసి సీఎం వద్దకు బలరాం వెళ్లారు.
అంతేకాదు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకునే విధానంలోనే లోపం ఉందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుపట్టారు. కొంతమంది దోచుకుని ఆ డబ్బును దాచుకునేందుకు ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నారని గొట్టిపాటిని ఉద్దేశించి ఆరోపించారు. ప్రకాశం జిల్లా రాజకీయాలను ఇతర జిల్లా రాజకీయాలతో పోల్చవద్దన్నారు. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. పదేళ్లు ప్రతిపక్షంలో టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని … ఇబ్బందులు పెట్టిన వారినే ఇప్పుడు పార్టీలో తీసుకురావడం సరికాదని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీలోకి వస్తున్నామని టీడీపీ కార్యకర్తలను గొట్టిపాటి బెదిరిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై వుందన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే పిల్లిమొగ్గలు ఉండవన్నారు.
Click on Image to Read: