బాబు తీరు ప్రమాదకరం, టెర్రరిజం, నక్సలిజం బలపడేది ఇందుకే

ఏపీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతి దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అన్నింటిని బైపాస్ చేసి చంద్రబాబు ముందుకెళ్లడం చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. సేవ్ డెమొక్రసీ టూర్లో భాగంగా ఢిల్లీలో సీతారాం ఏచూరిని జగన్ బృందం కలిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏచూరి… చంద్రబాబు తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం, […]

Advertisement
Update:2016-04-26 07:48 IST

ఏపీలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న అవినీతి దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అన్నింటిని బైపాస్ చేసి చంద్రబాబు ముందుకెళ్లడం చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. సేవ్ డెమొక్రసీ టూర్లో భాగంగా ఢిల్లీలో సీతారాం ఏచూరిని జగన్ బృందం కలిసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏచూరి… చంద్రబాబు తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు.

ఫిరాయింపులను ప్రోత్సహించడం, ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, పదవులు ఇవ్వడం దారుణమన్నారు. ఆంధ్రదేశం ఎంతో ప్రఖ్యాతి సాధించాలని తామంతా కోరుకున్నామని.. కానీ చంద్రబాబు పాలనలో ఈ తరహా గుర్తింపు తెచ్చుకోవడం బాధగా ఉందన్నారు. ఈ తరహా అవినీతిని ఆపకపోతే ప్రజాస్వామ్యం అన్నది మిగలదన్నారు. ఒక్కసారి ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతే వ్యవస్థలను ఎవరూ కాపాడలేరన్నారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ కూడా చివరి మాటగా ఇదే విషయం చెప్పారన్నారు.

చంద్రబాబు చేసే ఇలాంటి చర్యల వల్లే టెర్రరిజం, మావోయిజం బలపడే అవకాశం ఉంటుందన్నారు. ఫిరాయింపుల తీవ్రత ఉత్తరాఖండ్‌లో కంటే ఏపీలో ఎన్నో రెట్లు అధికంగా ఉందన్నారు. వీలున్న ప్రతిచోట చంద్రబాబు చర్యలకు వ్యతిరేకంగా తాము గళం విప్పుతామన్నారు. పార్లమెంట్‌లోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ఫిరాయింపుల చట్టంలోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో వైసీపీ చేసే పోరాటానికి సీపీఎం అన్ని విధాలుగా మద్దతు తెలుపుతుందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News