రోజా చాలా మంచి అమ్మాయి అంటున్న టీడీపీ నేత
కాపుగర్జన సమయంలో తునిలో జరిగిన విధ్వంసం వెనుక జగన్ హస్తముందన్న ఆరోపణలను టీడీపీ నేత, వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఖండించారు. ముద్రగడకు జగన్ మద్దతు ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ కొందరు నేతలు ఏకంగా అల్లర్ల వెనుక జగన్ హస్తముందని చెప్పడం మాత్రం సరికాదన్నారు. అలా ఎవరన్నా కూడా తాను ఒప్పుకోనన్నారు. రోజా చాలా మంది అమ్మాయి అని నెహ్రు కితాబు ఇచ్చారు. తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేయడం రోజా అలవాటు అని అన్నారు. చంద్రబాబును రోజా […]
కాపుగర్జన సమయంలో తునిలో జరిగిన విధ్వంసం వెనుక జగన్ హస్తముందన్న ఆరోపణలను టీడీపీ నేత, వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఖండించారు. ముద్రగడకు జగన్ మద్దతు ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. కానీ కొందరు నేతలు ఏకంగా అల్లర్ల వెనుక జగన్ హస్తముందని చెప్పడం మాత్రం సరికాదన్నారు.
అలా ఎవరన్నా కూడా తాను ఒప్పుకోనన్నారు. రోజా చాలా మంది అమ్మాయి అని నెహ్రు కితాబు ఇచ్చారు. తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేయడం రోజా అలవాటు అని అన్నారు. చంద్రబాబును రోజా అసెంబ్లీలో దూషించిందన్న ఆరోపణలపై స్పందించిన నెహ్రు… ఆ రోజు సభలో అంతా గందరగోళంగా ఉంది కాబట్టి ఏం జరిగిందో తాను స్పష్టంగా చెప్పలేకపోతున్నానన్నారు.
రోజా ముక్కుసూటిగా మాట్లాడుతారు కాబట్టి అవతలి వారు ఏమైనా అంటారేమోనని తాను ఒక హద్దులాగా ఉండేవాడినని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆర్ధిక సమస్యలు లేకపోతే , చంద్రబాబు టికెట్ ఇస్తే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. పదవులు అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించే వ్యక్తిని తాను కాదన్నారు.
Click on Image to Read: