ఆశ్చర్యం.. రావెల సుశీల్‌పై కేసు కొట్టివేత

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ముస్లిం మహిళను చేయి పట్టుకుని లాగిన కేసు అనూహ్యంగా  అంతమైపోయింది. సుశీల్‌పై కేసును హైకోర్టు కొట్టివేసింది. సుశీల్ కారు డ్రైవర్‌పై నమోదైన కేసును కూడా అత్యున్నత  న్యాయస్థానం కొట్టివేసింది.సుశీల్ తనను వేధించలేదని బాధితురాలు అఫిడవిట్ ఇవ్వడంతో కోర్టు కేసును తొలగించింది. కొద్ది రోజుల క్రితం రావెల కిషోర్ బాబు తన కారులో ముస్లిం మహిళను వెంటాడారు. చేయి పట్టుకుని లాగాడు. మహిళను రావెల సుశీల్ తన కారుతో వెంబడించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో […]

Advertisement
Update:2016-04-25 06:19 IST

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ముస్లిం మహిళను చేయి పట్టుకుని లాగిన కేసు అనూహ్యంగా అంతమైపోయింది. సుశీల్‌పై కేసును హైకోర్టు కొట్టివేసింది. సుశీల్ కారు డ్రైవర్‌పై నమోదైన కేసును కూడా అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.సుశీల్ తనను వేధించలేదని బాధితురాలు అఫిడవిట్ ఇవ్వడంతో కోర్టు కేసును తొలగించింది.

కొద్ది రోజుల క్రితం రావెల కిషోర్ బాబు తన కారులో ముస్లిం మహిళను వెంటాడారు. చేయి పట్టుకుని లాగాడు. మహిళను రావెల సుశీల్ తన కారుతో వెంబడించిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. మహిళను లాగేందుకు ప్రయత్నించిన సుశీల్‌ను స్థానికులు అక్కడే చితక్కొట్టారు కూడా. అంతే కాదు బాధితురాలి ఫిర్యాదు మేరకు సుశీల్, అతడి డ్రైవర్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు.

అక్కడ ఏకంగా కేసునే కొట్టివేయించుకోగలిగారు. అంటే ఇప్పుడు బాధితురాలు తప్పుడు కేసు పెట్టిందనుకోవాలా?. మహిళను సుశీల్‌ తన కారులో వెంబడిస్తుండగా రికార్డు అయిన సీసీ కెమెరా దృశ్యాలను కల్పితం అనుకోవాలా?. కేసును ఇంత బలహీనంగా తయారు చేసిన పోలీసులను తప్పు పట్టాలా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News