ఏమయ్యా పసాదు… వేయాల్సింది వేషాలు కాదయ్యా!

ఏపీ అభివృద్ధి ఆగిపోవడానికి కారణం మొత్తం  కేంద్రం, ప్రధాని మోదీయేనని నమ్మించేందుకు టీడీపీ నేతలు తమ శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు కేంద్రంలో  మంత్రి పదవులను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు  కేంద్రం తీరు దారుణంగా ఉందంటూ మీడియా ముందు, జనం ముందు కలరింగ్ ఇస్తున్నారు. వేషాలు వేయడంలో ముందుండే ఎంపీ శివప్రసాద్ తాజాగా మరో అవతారం ఎత్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ కుచేలుడి వేషం వేసుకుని కాసేపు మీడియా వద్ద హడావుడి చేశారు. పద్యాలు […]

Advertisement
Update:2016-04-25 08:28 IST

ఏపీ అభివృద్ధి ఆగిపోవడానికి కారణం మొత్తం కేంద్రం, ప్రధాని మోదీయేనని నమ్మించేందుకు టీడీపీ నేతలు తమ శక్తిమేర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వైపు కేంద్రంలో మంత్రి పదవులను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కేంద్రం తీరు దారుణంగా ఉందంటూ మీడియా ముందు, జనం ముందు కలరింగ్ ఇస్తున్నారు. వేషాలు వేయడంలో ముందుండే ఎంపీ శివప్రసాద్ తాజాగా మరో అవతారం ఎత్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ కుచేలుడి వేషం వేసుకుని కాసేపు మీడియా వద్ద హడావుడి చేశారు. పద్యాలు పాడారు. ”ఇంతింతి ఇస్తే ఎప్పుడు పూరునో లోటు… బాబు కష్టం చూస్తే బాధగా ఉంది.. వెంకయ్య ఏమాయనో తెలియకుంది.. మిత్ర బంధం ఏమాయరో… నమో రామా నమో కృష్ణా, నమో మోదీ” అంటూ రాగాలు తీశారు. ఎప్పటిలాగే తెలుగు టీవీ చానళ్లు బాగానే కవరేజ్ ఇచ్చాయి. వేషం ఎపిసోడ్ ముగిసిపోయింది.

అయినా ఏపీకి కేంద్రం అంత అన్యాయం చేస్తుంటే ఇలా పగటివేషాలు వేస్తే పని జరుగుతుందా?. కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగరు. ఏపీకి వెంకయ్య, ఇతర కేంద్రమంత్రులు వస్తే మాత్రం సన్మానాలు చేసి పంపుతారు. పార్లమెంట్‌లో కనీసం పోడియం వద్దకు వెళ్లి కూడా ఏపీకి న్యాయం చేయండి అంటూ టీడీపీ ఎంపీలు నినాదాలు చేయరు. ఎవరూ లేనిది చూసి, తెలుగు టీవీ చానళ్లను మాత్రమే పిలుచుని ఇలా వేషాలు మాత్రం వేస్తారు. ఏపీకి నిధులు, ప్రత్యేక హోదా రావాలంటే ఇలా వేషాలు వేస్తే సరిపోదు పసాదు.. ఇంకా చాలా చేయాలి. చంద్రబాబును తీసుకొచ్చి కనీసం ఒక గంట పాటు ఢిల్లీ జంతర్ మంతర్‌ వద్ద ధర్నా చేయించండి. రిజల్ట్ మరోలా ఉంటది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News