భూమాకు సవాల్‌పై నీళ్లు నమిలిన నెహ్రూ

ఇకపై నేతల మాటలను నమ్మాలంటే ముందుగా అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక సదరు పార్టీ స్ర్కిప్టో తెలుసుకుని ఒక నిర్ధారణకు రావాలి కాబోలు. ఆదివారం ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి.  తాను వైసీపీలో ఉండగా పార్టీ వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన వద్ద ప్లే చేశారు సదరు విలేకరి. పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలంతా అవినీతి సూట్‌కేసులకు అమ్ముడుపోయారని, గొడ్డులను కొంటున్నట్టుగా […]

Advertisement
Update:2016-04-24 16:52 IST

ఇకపై నేతల మాటలను నమ్మాలంటే ముందుగా అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక సదరు పార్టీ స్ర్కిప్టో తెలుసుకుని ఒక నిర్ధారణకు రావాలి కాబోలు. ఆదివారం ఒక ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పిన మాటలు అలాగే ఉన్నాయి. తాను వైసీపీలో ఉండగా పార్టీ వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలను ఉద్దేశించి జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన వద్ద ప్లే చేశారు సదరు విలేకరి.

పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలంతా అవినీతి సూట్‌కేసులకు అమ్ముడుపోయారని, గొడ్డులను కొంటున్నట్టుగా ఎమ్మెల్యేలను చంద్రబాబు కొంటున్నారని, చంద్రబాబు తన అసమర్ధ పాలనను కప్పిపుచ్చుకునేందుకే ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ జ్యోతుల చేసిన వ్యాఖ్యలు సదరు వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోను చూసిన జ్యోతుల నెహ్రూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. వెంటనే అవి తన మాటలు కాదని వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పేశారు. అంటే పార్టీ ఏం చెప్పినా అది మాట్లాడేస్తారా అని ప్రశ్నించగా నెహ్రూ సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.

తాను 30 కోట్లకు అమ్ముడుపోయిన మాట అవాస్తవం అన్నారు. మంత్రి పదవి ఇస్తామని టీడీపీ నాయకత్వం చెప్పిన మాట మాత్రం వాస్తవమేనన్నారు. తమ ప్రాంతానికి సాగునీరు ఇవ్వడంతో పాటు వేలాది ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమను ఏర్పాటు చేయాలని చంద్రబాబును కోరానన్నారు. ఓడినా గెలిచినా తాను ఎప్పటికీ ప్రజానాయకుడినేనని చెప్పారు. ఇప్పటి వరకు నేరుగా తాను రెండు కోట్ల రూపాయలను ఒకేసారి చూడలేదన్నారు. గతంలో భూమానాగిరెడ్డి పార్టీ వీడినప్పుడు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి గెలవాలంటూ తాను విసిరిన సవాల్‌ను ప్రస్తావించగా నెహ్రూ నేరుగా స్పందించలేకపోయారు. రాజీనామా తనకు పెద్దసంగతే కాదంటూనే అందుకు పార్టీ నాయకత్వం ఒప్పుకోవాలన్నారు. తాను అమ్ముడుపోయానని విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకత్వం రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమా అంటూ విచిత్రమైన సవాల్ విసిరారు. ఎన్నికలంటే భయపతున్నట్టుగా మీ తీరు ఉందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని జ్యోతుల నెహ్రూ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News