చంద్రబాబుతో నాకు ఏదో అనుబంధం ఉంది!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసలు కురిపించారు. ఆదివారం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన భారతి… చంద్రబాబు తన సోదరుడి లాంటి వారని అన్నారు. తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేకున్నా ఆయననే ఫాలో అయ్యేదానినని చెప్పారు. చంద్రబాబు ఒక ఫాస్ట్ ట్రాక్ సీఎం అని కితాబిచ్చారు. చంద్రబాబుతో తనకు ఏదో పూర్వజన్మ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు పనితీరంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. చంద్రబాబు గురించి […]

Advertisement
Update:2016-04-23 11:33 IST

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసలు కురిపించారు. ఆదివారం చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన భారతి… చంద్రబాబు తన సోదరుడి లాంటి వారని అన్నారు. తాను మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా లేకున్నా ఆయననే ఫాలో అయ్యేదానినని చెప్పారు. చంద్రబాబు ఒక ఫాస్ట్ ట్రాక్ సీఎం అని కితాబిచ్చారు. చంద్రబాబుతో తనకు ఏదో పూర్వజన్మ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుందన్నారు. చంద్రబాబు పనితీరంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. చంద్రబాబు గురించి మోదీకి చెప్పేదాన్నని అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News