తుమ్మలకు కేటీఆర్‌నే ఎదిరించే స్టామినా వచ్చేసిందా?

ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీఆర్‌ఎస్‌ మీద ఆధారపడి తుమ్మల బతుకుతున్నారా లేక… తుమ్మల మీదే టీఆర్‌ఎస్ ఆధారపడిందా అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.  సాధారణంగా టీఆర్‌ఎస్ నేతలెవరైనా కేసీఆర్‌కు వారసుడిగా కేటీఆర్‌ను సమర్ధిస్తారు. లోపల ఇష్టం లేకుంటే కనీసం తమ నాయకుడు కేసీఆర్  నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతారు.  మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు మాత్రం చాలా ఓపెన్‌గా కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌ రావడాన్ని సమర్ధించనని […]

Advertisement
Update:2016-04-23 04:31 IST

ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. టీఆర్‌ఎస్‌ మీద ఆధారపడి తుమ్మల బతుకుతున్నారా లేక… తుమ్మల మీదే టీఆర్‌ఎస్ ఆధారపడిందా అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సాధారణంగా టీఆర్‌ఎస్ నేతలెవరైనా కేసీఆర్‌కు వారసుడిగా కేటీఆర్‌ను సమర్ధిస్తారు. లోపల ఇష్టం లేకుంటే కనీసం తమ నాయకుడు కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతారు. మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు మాత్రం చాలా ఓపెన్‌గా కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌ రావడాన్ని సమర్ధించనని చెప్పారు.

కేసీఆర్ పక్షాన, పార్టీ పక్షాన మాత్రమే నిలబడుతానని చెప్పారు. తన వారసత్వాన్నే తాను ప్రమోట్ చేసుకోవడం లేదని ఇక ఎవరి వారసత్వాన్నో తానెలా సమర్ధిస్తానని ఎదురు ప్రశ్నించారు. కేటీఆర్‌ను కూడా సమర్ధించరా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా వారసత్వాన్ని మాత్రం తాను సమర్ధించనని మరోసారి స్పష్టంగా చెప్పారు. సాధారణ రోజుల్లో అయితే ఈ వ్యాఖ్యలను మరోలా తీసుకోవచ్చు. కానీ పాలేరు ఎన్నికల్లో తుమ్మల పోటీ చేస్తుండడం, ఆ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా కేటీఆర్ పనిచేస్తున్న వేళ మంత్రి తుమ్మల ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పాలేరులో టీఆర్ఎస్ గెలిస్తే ఈ క్రెడిట్‌ను తన కుమారుడి ఖాతాలోకి వేయాలనే కేటీఆర్‌ను ఉప ఎన్నికకు ఇన్‌చార్జ్‌గా పెట్టారని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ప్రాధాన్యతను తగ్గించేందుకు తుమ్మల ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తుమ్మలను పిలిచి మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేసిన కేసీఆర్‌ తన కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తే దాన్ని సమర్థించబోనని తుమ్మల చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. ఒక వేళ కేటీఆర్ అంటే ఇష్టం లేకపోతే మౌనంగా ఉండాలే గానీ నేరుగా వారసత్వాన్ని సమర్ధించనని చెప్పడం బట్టి తుమ్మలకు టీఆర్‌ఎస్‌లో గట్టి పట్టే ఉందని భావించాలేమో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News