స్పీకర్ కూడా భాగస్వామే….

ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌ కూడా భాగస్వామి అయ్యారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు. స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కూడా తమకు లేదన్నారు. అందుకే  ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న తీరును  రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసి వివరిస్తామన్నారు. లంచాల సొమ్ముతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడంపై విచారణ జరిపించాలని కోరుతామన్నారు.  చంద్రబాబు చేతిలో అధికారం, పోలీసులు, […]

Advertisement
Update:2016-04-23 06:59 IST

ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్‌ కూడా భాగస్వామి అయ్యారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదన్నారు. స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం కూడా తమకు లేదన్నారు. అందుకే ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్తామన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న తీరును రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలిసి వివరిస్తామన్నారు. లంచాల సొమ్ముతో చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడంపై విచారణ జరిపించాలని కోరుతామన్నారు. చంద్రబాబు చేతిలో అధికారం, పోలీసులు, మీడియా అంతా ఉన్నా … ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడడం లేదని ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పిరాయింపులపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు. చంద్రబాబు బినామీలు భూములు కొన్న తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారని, వేల కోట్ల రూపాయల భూ కుంభకోణాలను చేశారని ఆరోపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News