గవర్నర్‌కే కాదు… దిక్కున్న చోట చెప్పుకోండి

ఏపీలో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లిపోయినట్టుగా ఉన్నాయి. రాజ్యాంగం ఉన్నది కేవలం ప్రమాణం చేయడానికే అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అసలు ఏపీలో సొంత రాజ్యాంగమే నడుస్తోంది. గవర్నర్‌ అంటే లెక్కేలేదు. రాజ్యాంగం అంటే భయమే లేదు. ఇందుకు  శనివారం జరిగిన పరిణామాలే నిదర్శనం. పార్టీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి కొనడంపై రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వైసీపీ ముందే ప్రకటించింది. కానీ చంద్రబాబు లెక్కచేయలేదు. గవర్నర్‌కు కాకపోతే ఇంకెవరికైనా ఫిర్యాదు చేసుకోండి అన్నట్టుగా శనివారం కూడా […]

Advertisement
Update:2016-04-23 09:33 IST

ఏపీలో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లిపోయినట్టుగా ఉన్నాయి. రాజ్యాంగం ఉన్నది కేవలం ప్రమాణం చేయడానికే అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అసలు ఏపీలో సొంత రాజ్యాంగమే నడుస్తోంది. గవర్నర్‌ అంటే లెక్కేలేదు. రాజ్యాంగం అంటే భయమే లేదు. ఇందుకు శనివారం జరిగిన పరిణామాలే నిదర్శనం.

పార్టీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి కొనడంపై రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వైసీపీ ముందే ప్రకటించింది. కానీ చంద్రబాబు లెక్కచేయలేదు. గవర్నర్‌కు కాకపోతే ఇంకెవరికైనా ఫిర్యాదు చేసుకోండి అన్నట్టుగా శనివారం కూడా కుండమార్పిడి కార్యక్రమం నిర్వహించారు. ఫిరాయింపులపై గవర్నర్‌ను జగన్‌ కలిసిన సమయంలోనే విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌ బాషా కండువా కలర్ మార్చేశారు చంద్రబాబు. పైగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఇప్పుడు రాజకీయాలు చేయడం సరికాదంటూ అత్తర్ బాషాను పక్కన నిలబెట్టుకుని నీతిసూత్రాలు చెప్పారు చంద్రబాబు.

ఈ పరిణామంపై గవర్నర్ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష నాయకుడు తనను కలిసిన సమయంలోనే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ఫిరాయింపుదారుడికి కండువా కప్పడంపై గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. గవర్నర్‌కు కాదు ఇంకెంత పెద్దవారికి ఫిర్యాదు చేసినా తన తీరు మారదు ఇంతే అని చాటేలా చంద్రబాబు చర్యలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ అంటే తనకు పూచికపుల్లతో సమానం అన్న మేసేజ్‌ను పంపేందుకే నరసింహన్‌ను జగన్ కలిసిన సమయంలోనే చంద్రబాబు చాంద్ బాషాకు టీడీపీ కండువా కప్పారని అంటున్నారు. అయినా అన్ని వ్యవస్థల్లోకి తన మనుషులను చొప్పించిన చంద్రబాబును గవర్నర్‌ ఏం చేయగలరు?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News