ర్యాంకులపై మంత్రుల జోకులు… చంద్రబాబు ఫోన్

చంద్రబాబు మూడు రోజుల క్రితం మంత్రులకు ఇచ్చిన ర్యాంకులు నవ్వుల పాలవుతున్నాయి. స్వయంగా మంత్రులే జోకులేసుకోవడం, ఆ విషయం టీడీపీ అనుకూల పత్రికల్లో రావడం చర్చనీయాంశమైంది.  పీతల సుజాతకు మొదటి ర్యాంకు రావడం, నారాయణకు చివరి ర్యాంకు రావడం చూసి  కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే మంత్రులు జోకులేసుకుని నవ్వుకున్నారట. కొందరు మంత్రులు తమకు వచ్చిన ర్యాంకులు చూసి ఆశ్చర్యపోయారట. తాము నియోజకవర్గాలలో, జిల్లాల్లో పనిచేయకపోయినా, పేపర్లలో కనిపించడం, ప్రెస్ మీట్ పెట్టినట్టు బ్రేకింగ్స్ వస్తే చాలు […]

Advertisement
Update:2016-04-21 07:27 IST

చంద్రబాబు మూడు రోజుల క్రితం మంత్రులకు ఇచ్చిన ర్యాంకులు నవ్వుల పాలవుతున్నాయి. స్వయంగా మంత్రులే జోకులేసుకోవడం, ఆ విషయం టీడీపీ అనుకూల పత్రికల్లో రావడం చర్చనీయాంశమైంది. పీతల సుజాతకు మొదటి ర్యాంకు రావడం, నారాయణకు చివరి ర్యాంకు రావడం చూసి కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే మంత్రులు జోకులేసుకుని నవ్వుకున్నారట. కొందరు మంత్రులు తమకు వచ్చిన ర్యాంకులు చూసి ఆశ్చర్యపోయారట.

తాము నియోజకవర్గాలలో, జిల్లాల్లో పనిచేయకపోయినా, పేపర్లలో కనిపించడం, ప్రెస్ మీట్ పెట్టినట్టు బ్రేకింగ్స్ వస్తే చాలు వాటిని కూడా పరిగణలోకి తీసుకుని ర్యాంకులిస్తున్నారని నవ్వుకున్నారట. విపరీతంగా కష్టపడి ఎండలకు తిరగాల్సిన పనిలేదని సింపుల్‌గా మీడియాను మ్యానేజ్ చేసుకుంటే సరిపోతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారట. మంత్రులు ర్యాంకులపై జోకులేసుకున్న విషయం టీడీపీ అనుకూల పత్రికల్లోనే రావడంతో కలకలం రేగింది. మంత్రుల జోకులపై సీఎం సీరియస్ అయినట్టు సమాచారం.

మరోవైపు ర్యాంకుల విషయంలో తనకు ఘోర అవమానం జరిగిందని అసంతృప్తితో ఉన్న నారాయణను సీఎం చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. నారాయణ వెలగపూడిలో ఉండగా చంద్రబాబు ఫోన్ చేశారు. ర్యాంకుల గురించి పట్టించుకోవద్దని … ర్యాంకుల తయారీలో లోపాలు ఉన్నాయని సర్ధిచెప్పేప్రయత్నం చేశారు. అంతేకాదు…

ర్యాంకులను బయటకు చెప్పవద్దని కేబినెట్ భేటీలోనే ఆదేశించినా… అవి మీడియాకు ఎలా అందాయో అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నట్టు టీడీపీ అనుకూల పత్రిక కథనం. అయితే సీఎం చెప్పిన విషయాలపై నారాయణ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని సమాచారం. అటు నారాయణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. మున్సిపల్ శాఖ పనితీరు దారుణంగా ఉన్నట్టుగా చివరి ర్యాంకుతో చూపెట్టారని ఆవేదన చెందుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News