వెంటిలేటర్‌పై బొబ్బిలి పౌరుషం

బొబ్బిలి పౌరుషం. ఈ పేరు వింటే తాండ్రపాపరాయుడి వీరత్వం గుర్తుకు వస్తుంది. గజపతిరాజులపై దండేత్తిన ధీశాలి. నాటి పౌరుష ఘాతను చెప్పుకుని బొబ్బిలి రాజ వంశస్తులు బతుకుతున్నారు. తాండ్ర పాపరాయుడి పౌరుషాన్ని ఆయన ధీరత్వాన్ని చూసే ఇప్పుడు బొబ్బిలి కుటుంబసభ్యులు సుజయ్‌ కృష్ణా రంగారావు వరకూ అందరూ చేయెత్తి నమస్కరిస్తుంటారు. ఉత్తరాంధ్రలో బొబ్బిలి రాజుల చరిత్ర వేసిన ముద్ర అంత గట్టిది. కానీ.. ఇప్పుడు బొబ్బిలి పౌరుషం వెంటిలేటర్‌పైకి చేరింది. బొబ్బిలి పౌరుషం బతికి బట్టకడుతుందా లేక […]

Advertisement
Update:2016-04-20 10:25 IST
వెంటిలేటర్‌పై బొబ్బిలి పౌరుషం
  • whatsapp icon

బొబ్బిలి పౌరుషం. ఈ పేరు వింటే తాండ్రపాపరాయుడి వీరత్వం గుర్తుకు వస్తుంది. గజపతిరాజులపై దండేత్తిన ధీశాలి. నాటి పౌరుష ఘాతను చెప్పుకుని బొబ్బిలి రాజ వంశస్తులు బతుకుతున్నారు. తాండ్ర పాపరాయుడి పౌరుషాన్ని ఆయన ధీరత్వాన్ని చూసే ఇప్పుడు బొబ్బిలి కుటుంబసభ్యులు సుజయ్‌ కృష్ణా రంగారావు వరకూ అందరూ చేయెత్తి నమస్కరిస్తుంటారు. ఉత్తరాంధ్రలో బొబ్బిలి రాజుల చరిత్ర వేసిన ముద్ర అంత గట్టిది. కానీ..

ఇప్పుడు బొబ్బిలి పౌరుషం వెంటిలేటర్‌పైకి చేరింది. బొబ్బిలి పౌరుషం బతికి బట్టకడుతుందా లేక ఇంతటితో చచ్చిపోతుందా అన్నది సుజయ్‌ కృష్ణారంగారావు మీదే ఉంది. ఎందుకంటే పౌరుషం ఉంటే దమ్ముంటే పార్టీ పిరాయించిన సుజయ్‌ కృష్ణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి టీడీపీ తరపున గెలుపొందాలని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాల్ చేశారు. ఈ సవాల్ వాసిరెడ్డి పద్మతో ఆగిపోదు. సుజయ్‌ కృష్ణ అంశం ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ దమ్ముంటే రాజీనామా చేయ్ అన్న డిమాండ్ వస్తూనే ఉంటుంది.

తాండ్రపాపరాయుడు వంశంలో పుట్టిన వ్యక్తులు కాబట్టి ఆ వంశం పౌరుషం ఇంకా ఉందని నిరూపించుకోవడానికైనా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏ పిరాయింపు ఎమ్మెల్యే పైనా లేని ఈ రకమైన ఒత్తిడి సుజయ్‌ కృష్ణపై ఉంది. అంటే ఒక విధంగా బొబ్బిలి పౌరుషం బతకాలంటే ధైర్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దమ్మెంతో సుజయ్ నిరూపించుకోవాలి. అలా చేయని పక్షంలో కనీసం సొంతంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని వారికి ఇక బొబ్బిలి రాజులు అన్న ట్యాగ్ లైన్ ఎందుకని జీవితాంతం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా ఒకప్పుడు తాండ్రపాపరాయుడు దండెత్తిన గజపతుల కోటలోకే బొబ్బిలి వంశీకులు ఒంగి వెళ్లారు. ఇక పౌరుషం అనేది ఎక్కడుంటుంది?. గెలుపు ఓటములను పక్కన పెడితే ఒకవేళ సుజయ్ కృష్ణ నిజంగా వైసీపీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడితే ఆయనను అభినందించాల్సిందే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News