నారాయణ కాలేజ్ విద్యార్థులకు ఇది శుభవార్తే!

మంత్రుల జాబితాలో నారాయణకు చివరి ర్యాంకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కాసులు పిండి… విద్యార్థులను యంత్రాలుగా మార్చి ర్యాంకుల పంట పండిస్తున్న నారాయణకే ర్యాంకు రాకపోవడం అవమానకరమే. ఒక విద్యార్ధికి పదో ర్యాంకు వచ్చినా సరే.. మొదటి ర్యాంకు ఎందుకు రాలేదని మానసికంగా వేధించే నారాయణ కాలేజీల అధినేతను ఇప్పుడు ఈ విషయంపై నిలదీసేదెవరు?. విఫలమైన టీచర్‌.. విద్యార్థులకు పాఠాలు చెప్పడం న్యాయమేనా?. కాలేజ్ విద్యార్థులను ర్యాంకుల విషయంపై ఇకపై గట్టిగా […]

Advertisement
Update:2016-04-19 02:26 IST

మంత్రుల జాబితాలో నారాయణకు చివరి ర్యాంకు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కాసులు పిండి… విద్యార్థులను యంత్రాలుగా మార్చి ర్యాంకుల పంట పండిస్తున్న నారాయణకే ర్యాంకు రాకపోవడం అవమానకరమే. ఒక విద్యార్ధికి పదో ర్యాంకు వచ్చినా సరే.. మొదటి ర్యాంకు ఎందుకు రాలేదని మానసికంగా వేధించే నారాయణ కాలేజీల అధినేతను ఇప్పుడు ఈ విషయంపై నిలదీసేదెవరు?. విఫలమైన టీచర్‌.. విద్యార్థులకు పాఠాలు చెప్పడం న్యాయమేనా?.

కాలేజ్ విద్యార్థులను ర్యాంకుల విషయంపై ఇకపై గట్టిగా నిలదీస్తే… నారాయణగారికే ర్యాంకు రాలేదు కదా! అని పిల్లకాయలు ఎదురు ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటి?. విద్యార్థులందరికీ సమానంగా చదువు చెప్పాల్సిన కాలేజీలో వారి మార్కుల ఆధారంగా విభజించి విడివిడి మోతాదులో క్లాసులు చెప్పడం నారాయణ కాలేజీల్లో జరిగేదే. మరి ఇప్పుడు పూర్ మినిస్టర్‌గా పేరుతెచ్చుకున్న నారాయణను కేబినెట్‌ భేటీలో ఆఖరి స్థానంలో కూర్చోబెడుతారా?. మంత్రిగా నారాయణ అత్యంత దారుణంగా విఫలమయ్యారని చంద్రబాబే ర్యాంకు ఇచ్చి ప్రకటించారు కదా… మరి ఆ పదవిలో నారాయణ కొనసాగుతారా?.

విద్యార్థులకు, సమాజానికి ఆదర్శంగా ఉండేందుకు… తన పదవివిబాధ్యతలను మరొక సమర్ధుడు నిర్వహించేలా అవకాశం కల్పిస్తూ రాజీనామా చేస్తారా?. మొత్తం మీద నారాయణకు ఆఖరి ర్యాంకు రావడం ఆయన కాలేజీల్లో యంత్రాల్లా చదువులు సాగిస్తున్న విద్యార్థులకు కాసింత రిలీఫే. తమ ర్యాంకుల విషయంలో కాలేజ్ యాజమాన్యం ప్రశ్నిస్తే… కనీసం మనసులోనైనా నారాయణ ర్యాంకును గుర్తు చేసుకుని విమర్శించే అవకాశం విద్యార్థులకుంటుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News