రైతులకు కుచ్చుటోపీ పెట్టిన పాస్టర్లు!
తక్కువ ఖర్చుతో బోర్లు వేయిస్తామంటూ రైతులను మోసం చేసిన నలుగురు పాస్టర్లను కరీం నగర్ జిల్లా, హుస్నాబాద్ మండలంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరు కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల రైతులకు ఎలక్ట్రిక్ మోటార్లు, బోర్‌వెల్స్, ఇతర వ్యవసాయ సామగ్రిని తక్కువ ధరలకు ఇస్తామని చెప్పి వారి నుండి 60 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉండగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీరంతా హుస్నాబాద్ మండల పరిధిలో […]
తక్కువ ఖర్చుతో బోర్లు వేయిస్తామంటూ రైతులను మోసం చేసిన నలుగురు పాస్టర్లను కరీం నగర్ జిల్లా, హుస్నాబాద్ మండలంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరు కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల రైతులకు ఎలక్ట్రిక్ మోటార్లు, బోర్‌వెల్స్, ఇతర వ్యవసాయ సామగ్రిని తక్కువ ధరలకు ఇస్తామని చెప్పి వారి నుండి 60 లక్షల రూపాయలను వసూలు చేశారు. ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉండగా పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.
వీరంతా హుస్నాబాద్ మండల పరిధిలో ఉన్న చర్చిల్లో బోధకులుగా ఉన్నారు. నిందితులు అందరూ కలిసి లైట్ వే మినిస్టిరీస్ అనే సంస్థని, జీవజాలం అనే పథకాన్ని ప్రారంభించారు. దీనిద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో బోర్లు వేయిస్తామంటూ ప్రచారం చేశారు. కొంతడబ్బు చెల్లించాల్సి ఉంటుందంటూ వారినుండి డబ్బుని వసూలు చేశారు. ఒక్క మెదక్ జిల్లాలోని అలువల గ్రామం నుండే 95మంది రైతుల నుండి 33 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఒక్కో రైతు వీరికి 35వేల రూపాయలు చెల్లించాడు. హుస్నాబాద్‌లో 300 బోర్లు వేయించే పనిని మొదలుపెట్టారు. మోటార్లు కానీ ఇతర పరికరాలు గానీ ఏవీ తెప్పించలేదని తెలుస్తోంది. రైతుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దీనిపై విచారణ మొదలుపెట్టారు.
Click on Image to Read: