గంటాకు మెగా స్ర్టోక్‌... ఫైళ్లు పక్కనపెట్టాలని బాబు ఆదేశం

మంత్రి గంటా శ్రీనివాస్‌రావుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు ఆగ్రహం రావడానికి ఇటీవల గంటా వ్యవహరించిన తీరే కారణం అని చెబుతున్నారు. కొద్ది కాలంగా చిరంజీవి ఆయన కుటుంబసభ్యులతో గంటా సన్నిహితంగా వుండడం చిరంజీవికి క్రేజ్‌ తెచ్చే పనులను గంటా చేస్తున్నారని సీఎంకు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల వైజాగ్‌లో సరైనోడు సినిమా ఆడియోపంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఫంక్షన్‌ ఈ స్థాయిలో సక్సెస్‌ అవడం వెనుక […]

Advertisement
Update:2016-04-16 05:56 IST

మంత్రి గంటా శ్రీనివాస్‌రావుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. చంద్రబాబుకు ఆగ్రహం రావడానికి ఇటీవల గంటా వ్యవహరించిన తీరే కారణం అని చెబుతున్నారు. కొద్ది కాలంగా చిరంజీవి ఆయన కుటుంబసభ్యులతో గంటా సన్నిహితంగా వుండడం చిరంజీవికి క్రేజ్‌ తెచ్చే పనులను గంటా చేస్తున్నారని సీఎంకు కొందరు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా ఇటీవల వైజాగ్‌లో సరైనోడు సినిమా ఆడియోపంక్షన్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఫంక్షన్‌ ఈ స్థాయిలో సక్సెస్‌ అవడం వెనుక గంటా శ్రీనివాస్‌రావు చేసిన జన సమీకరణే కారణమని ఇంటిలిజెన్స్‌ పసిగట్టినట్టు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటినుంచి గంటాపై సీఎం సీరియస్‌గా వున్నారు. కాంగ్రెస్‌లో వున్న చిరంజీవి కుటుంబసభ్యులతో, టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా వుంటూ అంత సన్నిహితంగా ఎలా వుంటారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ప్రజల్లో బలహీనపడిన చిరంజీవిని బలోపేతం చేసే కార్యక్రమాలకు ప్రభుత్వంలోని ఒక మంత్రి పనిచేయడం క్షమించరాని తప్పిదం అని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గంటాశ్రీనివాస్‌రావు చేసే సిఫార్సులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని గంటా పంపే ఫైళ్లను కూడా వెంటనే క్లియర్‌ చేయాల్సిన అవసరం కూడా లేదని సీఎంఓ అధికారులకు బాబు గైడ్‌ చేసినట్లు చెబుతున్నారు. గంటా చేసే సిఫార్సులు కీలకమైనవైతే తన దృష్టికి తెచ్చిన తరువాతే ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారని సమాచారం.

మంత్రి గంటాపై చంద్రబాబే కాకుండా లోకేష్‌కూడా కొన్ని నెలలుగా తీవ్ర అసంతృప్తితో వున్నారు. ఆంధ్రాయూనివర్శిటీ వీసీ నియామకంలో తన సామాజిక వర్గానికే చెందిన నారాయణను వీసీగా నియమించాలని గంటా పట్టుదలతో వున్నారు. అయితే లోకేష్‌ మాత్రం ఉమామహేశ్వర్‌రావుని వీసీగా నియమించాలని ఒత్తిడి తెస్తున్నారు. అయితే తన సొంత జిల్లాలోనే, తన శాఖ పరిధిలోనే వున్న వీసీ నియామకంలో తన మాట చెల్లుబాటుకాకపోతే ఇక తన పరువు ఏమి కావాలని గంటా ఆవేదన. ఈ నేపధ్యంలోనే సీఎంకు, గంటాకు మధ్య రోజురోజుకు గ్యాప్‌ పెరుగుతుందని భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News