దళిత సంఘాలపై భూమా అనుచిత వ్యాఖ్యలు

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజే దళిత సంఘాల వారిని హేళన చేసి మాట్లాడడం చర్చనీయాంశమైంది.  నంద్యాలలోని బొమ్మలసత్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు భూమా హాజరయ్యారు. ఈసందర్భంగా దళిత సంఘాల నేతలు నంద్యాలలో అంబేద్కర్ భవన్ నిర్మించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే వారి డిమాండ్‌పై భూమా ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు.  ”తినడానికి తిండిలేదు గానీ… నంద్యాల నడిబొడ్డున అంబేద్కర్ భవనం కావాలా?” అని […]

Advertisement
Update:2016-04-15 05:29 IST

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజే దళిత సంఘాల వారిని హేళన చేసి మాట్లాడడం చర్చనీయాంశమైంది. నంద్యాలలోని బొమ్మలసత్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు భూమా హాజరయ్యారు.

ఈసందర్భంగా దళిత సంఘాల నేతలు నంద్యాలలో అంబేద్కర్ భవన్ నిర్మించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. అయితే వారి డిమాండ్‌పై భూమా ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు. ”తినడానికి తిండిలేదు గానీ… నంద్యాల నడిబొడ్డున అంబేద్కర్ భవనం కావాలా?” అని ప్రశ్నించారు. ఖరీదైన స్థలాలున్న పద్మావతినగర్‌లో అంబేద్కర్ భవన్ నిర్మాణం సాధ్యం కాదని భూమా తేల్చేశారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు నొచ్చుకున్నారు. అభ్యంతరం చెప్పారు. తినడానికి తిండిలేకపోయినా అంబేద్కర్ భనవ్ అవసరమా అన్న వ్యాఖ్యలు భూమాకు దళితుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే తేరుకున్న భూమా తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే ఉపసంహరించుకుంటానన్నారు. అయితే గతంలో భూమా వైసీపీలో ఉండగా… ఒక డిఎస్పీని డోన్ట్ టచ్ మీ అన్నందుకే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరి ఇప్పుడు ఏకంగా దళితులపై నేరుగా అనుచిత వ్యాఖ్యలు చేసిన భూమాపై అట్రాసిటీ కేసు పెడుతారో లేదో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News