హైకోర్టు స్టే- జగన్ కేసు దూది పింజేనా?

జగన్ ఆస్తుల కేసులో పస ఉన్నట్టు కనిపించడం లేదు. దర్యాప్తు సంస్థలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.  లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూముల కేటాయింపులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్యాంబాబును  ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల క్రితం నిరాకరించగా ఇప్పుడు హైకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకుంది. శ్యాంబాబుపై విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.  భూముల కేటాయింపులో శ్యాంబాబు తప్పులేదని ఆయన తరపున న్యాయవాది వాదించారు.  తప్పులేదు కాబట్టే శ్యాంబాబును ప్రాసిక్యూట్ చేసేందుకు […]

Advertisement
Update:2016-04-14 04:08 IST

జగన్ ఆస్తుల కేసులో పస ఉన్నట్టు కనిపించడం లేదు. దర్యాప్తు సంస్థలకు కోర్టుల్లో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూముల కేటాయింపులో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్యాంబాబును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం కొద్ది రోజుల క్రితం నిరాకరించగా ఇప్పుడు హైకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకుంది. శ్యాంబాబుపై విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భూముల కేటాయింపులో శ్యాంబాబు తప్పులేదని ఆయన తరపున న్యాయవాది వాదించారు. తప్పులేదు కాబట్టే శ్యాంబాబును ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు.

భూములను ఏపీఐఐసీ కేటాయించిందని.. అందుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందని ఇందులో అధికారి తప్పు ఎక్కడుందని ప్రశ్నించారు. శ్యాంబాబు తరపు న్యాయవాది వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. అసలు ట్రయిల్ కోర్టు శ్యాంబాబుకు వ్యతిరేకంగా ఎలా ప్రొసీడ్ అయిందని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాదనలు విన్న తర్వాత శ్యాంబాబుపై విచారణను నిలిపివేస్తూ జస్టిస్ ఇళంగో ఆదేశాలు జారీ చేశారు.

శ్యాంబాబును ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రంతో పాటు తెలంగాణ, ఏపీలోని టీడీపీ ప్రభుత్వం కూడా నిరాకరించడం బట్టి చూస్తుంటే లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు ఇక నిలబడదని భావిస్తున్నారు. అధికారులది, మంత్రివర్గానిది కూడా తప్పులేదని తేలిన తర్వాత ఇక జగన్‌పై కేసు ఎలా నిలబడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు, మంత్రులదే తప్పు లేనప్పుడు ఆ సమయంలో ఎలాంటి పదవిలో లేని జగన్‌ మీద కేసు ఎలా నిలబడుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ అధికారులు మహంతి, బీపీ ఆచార్యపై విచారణను హైకోర్టు నిలిపివేసింది.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News