సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్‌కు సీఎం రమేష్ ఆఫర్ ఇస్తారా?

సాక్షి పత్రిక అంటే చాలు టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.  టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మరోసారి సాక్షి మీడియాపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌ లో పెట్టిన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థకు ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను యదేచ్చగా అప్పగిస్తోందంటూ సాక్షి భారీ కథనం రాయడంపై రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, సాక్షి ప్రతికపై పరుగు నష్టం దావా వేస్తానని మరోసారి ప్రకటించారు. అవినీతిపరుడైన జగన్‌కు అందరూ […]

Advertisement
Update:2016-04-14 00:32 IST

సాక్షి పత్రిక అంటే చాలు టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మరోసారి సాక్షి మీడియాపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌ లో పెట్టిన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థకు ఏపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులను యదేచ్చగా అప్పగిస్తోందంటూ సాక్షి భారీ కథనం రాయడంపై రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, సాక్షి ప్రతికపై పరుగు నష్టం దావా వేస్తానని మరోసారి ప్రకటించారు. అవినీతిపరుడైన జగన్‌కు అందరూ అవినీతిపరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేష్ విమర్శించారు. పనిలో పనిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిపైనా విమర్శలు చేశారు.

కేవలం డబ్బు కోసం సాక్షిలాంటి పత్రికలో రామచంద్రమూర్తి ఎలా పనిచేస్తున్నారని ప్రశ్నించారు. ఎంతో అనుభవం ఉన్న మూర్తి సాక్షి పత్రికలో చేరడం బాధగా ఉందన్నారు. మూర్తి అంటే తమకు ఎనలేని గౌరవం అని చెప్పారు. తన దగ్గరకు ఎవరూ వెళ్లినా వారిని తన దారిలోకి తెచ్చుకోవడంలో జగన్ దిట్ట అని అన్నారు. జగన్‌ లాంటి అవినీతిపరుడి దగ్గర రామచంద్రమూర్తి ఎలా పనిచేస్తారని అన్నారు.. వెంటనే సాక్షిలో ఉద్యోగం మానేసి బయటకు రావాలని రామచంద్రమూర్తికి సీఎం రమేష్ పిలుపునిచ్చారు. ఒకవేళ అలా రాజీనామా చేసి వస్తే సీఎం రమేష్ ఆఫర్ ఇస్తారేమో!.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News