రామోజీ అంటే సాక్షికి మాత్రమే మర్యాదా! వాపోయిన టీవీ ఛానల్

మంగళవారం రాష్ట్రపతి చేతుల మీదుగా  రామోజీరావు, రజనీకాంత్‌లు పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. రాజమౌళి, సానియా మీర్జా కూడా పద్మ అవార్డులు అందుకున్నారు. అయితే  రామోజీరావు పద్మ విభూషణుడు అయిన సందర్భంగా తెలుగు పత్రికలు అనుసరించిన తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. రామోజీరావు అవార్డు అందుకున్న వార్తను ఈనాడు, సాక్షి తప్ప మరే పత్రిక కూడా మొదటి పేజీలో ప్రచురించలేదు. లోపలి పేజీల్లో చిన్నవార్తతో సరిపెట్టాయి. కొన్ని పత్రికలైతే లోపలి పేజీల్లో  కూడా సానియా మీర్జా ఫొటో వేశాయే గానీ […]

Advertisement
Update:2016-04-13 04:46 IST

మంగళవారం రాష్ట్రపతి చేతుల మీదుగా రామోజీరావు, రజనీకాంత్‌లు పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. రాజమౌళి, సానియా మీర్జా కూడా పద్మ అవార్డులు అందుకున్నారు. అయితే రామోజీరావు పద్మ విభూషణుడు అయిన సందర్భంగా తెలుగు పత్రికలు అనుసరించిన తీరు కాస్త ఆశ్చర్యంగానే ఉంది. రామోజీరావు అవార్డు అందుకున్న వార్తను ఈనాడు, సాక్షి తప్ప మరే పత్రిక కూడా మొదటి పేజీలో ప్రచురించలేదు. లోపలి పేజీల్లో చిన్నవార్తతో సరిపెట్టాయి. కొన్ని పత్రికలైతే లోపలి పేజీల్లో కూడా సానియా మీర్జా ఫొటో వేశాయే గానీ రామోజీ బొమ్మను మాత్రం ప్రచురించలేదు. చివరకు…

టీడీపీకి అనుకూలమైన మరో పత్రిక కూడా రామోజీకి మొదటి పేజీలో స్థానం ఇవ్వలేదు. అయితే ఆశ్చర్యంగా సాక్షి పత్రిక మాత్రం మొదటి పేజీలోనే రామోజీరావు అవార్డు అందుకుంటున్న ఫొటోను కూడా ప్రచురించింది. సాధారణంగా అయితే ఈనాడు పత్రికలో ఇప్పటి వరకు జగన్‌కు సంబంధించిన వ్యతిరేక వార్తలు మాత్రమే మొదటి పేజీలో వచ్చాయి. జగన్‌కు పాజిటివ్ వార్త ఒక్కటి కూడా ఈనాడు మొదటి పేజీలో వచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ మిగిలిన పత్రికల కంటే ఒక అడుగు ముందుకేసి రామోజీ బొమ్మను జగన్ పత్రిక అచ్చేసింది.

రాజమౌళి, సానిమా మీర్జాలు కూడా అవార్డులు అందుకున్నా వారి ఫొటో మాత్రం తొలి పేజీలో లేవు. అయితే దీనికి పత్రిక యాజమాన్యానికి లింక్ పెట్టలేం. పత్రిక వ్యవహారాలను చూస్తున్న ఎడిటోరియల్ పెద్దలే నిర్ణయం తీసుకుని ఉంటారు. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే జగన్‌కు సంబంధించిన వ్యతిరేకవార్తలను మాత్రమే తన ఈనాడు పత్రిక మొదటిపేజీలో అచ్చేసే రామోజీరావు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసేందుకు సాక్షి తన మొదటి పేజీలో చోటు ఇవ్వడమే కాస్త ఆసక్తిగా ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే…

పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న రామోజీ రావు ఫొటోను పత్రికలు మొదటి పేజీలో ప్రచురించకపోవడంపై ఒక ఛానల్ (సాక్షి కాదు) పత్రినిధి ఏకంగా చర్చ పెట్టారు. ‘’లివింగ్ లెజెండ్, ఐకాన్ లాంటి రామోజీరావుగారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే దాన్నితెలుగు పత్రికలు మొదటి పేజీలో వేయకపోవడాన్ని ఏమనుకోవాలి’’ అని ఆవేదన చెందారు. సానియా మీర్జాకు ఇచ్చిన ప్రాధాన్యత కూడా రామోజీరావుగారికి ఇవ్వరా అని వాపోయారు. చర్చలో పాల్గొన్న నవతెలంగాణ ఎడిటర్‌ను సదరు చానల్ ప్రతినిధి ఈ విషయంపై నేరుగా నిలదీశారు. నవతెలంగాణ పత్రిక ఎడిటర్ వీరయ్య ఇందుకు తగిన సమాధానం చెప్పారు.

రామోజీరావుకు అవార్డు ఎప్పుడో ప్రకటించారని అప్పుడే తాము వార్తలను ఇచ్చామని అన్నారు. పదేపదే రామోజీరావు గురించి రాయాల్సినంత అవసరం ఏముందని ప్రశ్నించారు. రామోజీ అవార్డు వార్త కన్నా ముఖ్యమైన అంశాలుచాలా ఉన్నాయని అందుకే తాము ఆ వార్తను తొలిపేజీలో వేయలేకపోయామని చెప్పారు. రామోజీరావుకు సాక్షి పత్రిక ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటో?. మిగిలిన పత్రికలు రామోజీని ఆకాశానికి ఎత్తలేదని ఒక చానల్ ప్రతినిధి ఏకంగా చర్చపెట్టి ఆవేదన చెందడం ఏమిటో?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News