నాగుల మధ్య జగన్

వైసీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంది.  ముఖ్యంగా సోమవారం టీడీపీలో చేరిన సందర్భంగా జ్యోతుల నెహ్రు చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా కాలం క్రితమే ఆయన టీడీపీకి సరెండర్ అయినట్టుగా అర్థమవుతోంది.  టీడీపీలోకి ఎప్పుడు వెళదామా అని ఎదురుచూస్తూ బతికానని నెహ్రు చెప్పారు. పుట్టినింటికి రావడం చాలా సంతోషంగా ఉందంటూ రక్తంలో ఎక్కడో ఇంకిపోయిన టీడీపీ అభిమానాన్ని బయటపెట్టుకుంటున్నారు.  అంతేకాదు రోజూ ఎన్టీఆర్‌ ఫొటోకు దండం పెట్టే […]

Advertisement
Update:2016-04-12 07:19 IST

వైసీపీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంది. ముఖ్యంగా సోమవారం టీడీపీలో చేరిన సందర్భంగా జ్యోతుల నెహ్రు చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా కాలం క్రితమే ఆయన టీడీపీకి సరెండర్ అయినట్టుగా అర్థమవుతోంది. టీడీపీలోకి ఎప్పుడు వెళదామా అని ఎదురుచూస్తూ బతికానని నెహ్రు చెప్పారు. పుట్టినింటికి రావడం చాలా సంతోషంగా ఉందంటూ రక్తంలో ఎక్కడో ఇంకిపోయిన టీడీపీ అభిమానాన్ని బయటపెట్టుకుంటున్నారు. అంతేకాదు రోజూ ఎన్టీఆర్‌ ఫొటోకు దండం పెట్టే తన దినచర్య ప్రారంభించేవాడినని చెప్పారు.

అంటే ఒకవిధంగా చాలాకాలంగానే టీడీపీతో టచ్‌లో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలు బట్టే అర్ధమవుతోంది. ఎప్పుడెప్పుడు టీడీపీలో చేరుదామా అని ఎదురుచూసినట్టు చెప్పారు. అంటే చివరి నిమిషం వరకు జగన్‌ పక్కనే కూర్చున్నా మనసంతా చంద్రబాబుతోనే ఉందన్నమాట. చివరకు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా నమ్మి నెహ్రుకే జగన్‌ అప్పగించారు. అప్పుడు కూడా జ్యోతుల పైకి వైసీపీ నేతగానే నటించారు. అవిశ్వాస తీర్మానం ముందుకు వెళ్లకపోవడానికి ప్రభుత్వం కొన్ని టెక్నికల్ అంశాలను ఎత్తిచూపింది. అంటే అవిశ్వాసాన్ని మూవ్ చేసిన జ్యోతుల నెహ్రుకు ఆ లోపాలు ముందే తెలిసి ఉంటాయని కూడా భావిస్తున్నారు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా మౌనంగా ఉండిపోయారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీలోకి ఎప్పుడెప్పుడు వెళదామా అని ఎదురు చూసిన నేత, ఎన్టీఆర్ బొమ్మకు దండం పెట్టనిదే దినచర్య ప్రారంభించని నేత, టీడీపీలోకి చేరగానే సొంతింటిలోకి వచ్చినంత ఆనందంగా ఉందని సంబరపడిపోతున్న నేత ఇంతకాలం వైసీపీలో ఎలా ఉన్నారో!. మనసంతా టీడీపీతోనే ఉన్నట్టు మాట్లాడుతున్న జ్యోతుల నెహ్రు అంటే ఇంతకాలం ఆ పార్టీలో కోవర్టుగా వుండి, అవకాశం కోసం, వెన్నుపోటు సందర్భం కోసం జగన్‌ వెంటనే నడిచారు కాబోలు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఎన్నికలు ముగిసిన వారానికే టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రకటించారు. అంటే వీరంతా రెండేళ్లపాటు వైసీపీలో విషనాగుల్లా బతికారు కాబోలు. సీనియర్‌ నేత అయి ఉండి ఇలా చేయడం ద్వారా కొత్త తరం నేతలకు ఎలాంటి సందేశం ఇచ్చారో జ్యోతులే సమీక్షించుకోవాలి. రోషం ఉంటే, పౌరుషం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి అని మాత్రం అడగవద్దు. మన రాష్ట్రాల్లో మరీ అంత ”అది, ఇది” ఉన్న నేతలు లేరు అని వైసీపీ అభిమానులు అంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News