కోర్టు మెట్లు ఎక్కాల్సిందే- హైకోర్టులో సుజనాకు నిరాశ
వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సిందేనని కేంద్రమంత్రి సుజనాచౌదరికి హైకోర్టు తేల్చిచెప్పింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన వారెంట్ నోటీసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే హాజరు గడువును మాత్రం కొద్దిగా పెంచుతూ మే 5న నాంపల్లి కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‑పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. సుజనా చౌదరి కంపెనీ మారిషస్ బ్యాంకులో రూ. […]
వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సిందేనని కేంద్రమంత్రి సుజనాచౌదరికి హైకోర్టు తేల్చిచెప్పింది. నాంపల్లి కోర్టు ఇచ్చిన వారెంట్ నోటీసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే హాజరు గడువును మాత్రం కొద్దిగా పెంచుతూ మే 5న నాంపల్లి కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ పిటిషన్‑పై తదుపరి విచారణను హైకోర్టు జూన్ 16కు వాయిదా వేసింది. సుజనా చౌదరి కంపెనీ మారిషస్ బ్యాంకులో రూ. 106 కోట్ల అప్పుచేసింది. కానీ తిరిగి చెల్లించలేదు. చెల్లించాల్సిందిగా బ్యాంకు కోరగా తనకు సంబంధం లేదని చెప్పారు. దీంతో బ్యాంకు కోర్టును ఆశ్రయించింది. దీనిపై పలుమార్లు సుజనాచౌదరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు కేంద్రమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు సుజనా.
Click on Image to Read: