పవన్‌పై కమ్యూనిస్ట్ నేత సెటైర్లు... "కేశవరెడ్డి" వెనుక స్కాం ఉందన్న ధర్మాన

హీరో పవన్‌ కల్యాణ్ తీరుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు.  ఇక సినిమాల్లో తన పనైపోయిందన్న ఉద్దేశంతోనే పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల మీద పడ్డారని ఎద్దేవా చేశారు.  ప్రజల తరపున ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పటి వరకు ఒకసారైనా ఆ పనిచేశారా అని ప్రశ్నించారు.  ఎమ్మెల్యేల ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తుంటే పవన్‌ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ప్ర‌త్యేక హోదాపై మోడీతో మాట్లాడే ద‌మ్ము, ధైర్మం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉందా అని […]

Advertisement
Update:2016-04-12 09:46 IST

హీరో పవన్‌ కల్యాణ్ తీరుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేశారు. ఇక సినిమాల్లో తన పనైపోయిందన్న ఉద్దేశంతోనే పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజల తరపున ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ ఇప్పటి వరకు ఒకసారైనా ఆ పనిచేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను చంద్రబాబు ప్రోత్సహిస్తుంటే పవన్‌ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ప్ర‌త్యేక హోదాపై మోడీతో మాట్లాడే ద‌మ్ము, ధైర్మం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఉందా అని ప్ర‌శ్నించారు..

చంద్రబాబు పండుగ పూట కూడా పాడుపనులు మానుకోవడం లేదని.. ఉగాది రోజు పక్కపార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై ఢిల్లీకి వెళ్లి పోరాడాలన్నారు. అందుకోసం తాము కూడా అండగా ఉంటామని తెలిపారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తప్పుపట్టారు. కేశవరెడ్డి విద్యాసంస్థల బాధ్యతలను చైతన్య కాలేజ్ యాజమాన్యానికి అప్పగించడం వెనుక కుంభకోణం ఉందని ఆరోపించారు. చైతన్యకాలేజ్‌లో మంత్రి నారాయణ వాటా తీసుకోవడం వల్లే కేశవరెడ్డి స్కూల్ బాధ్యతను అప్పగించారని విమర్శించారు. కేశవరెడ్డి విద్యాసంస్థలో విద్యార్థుల డిపాజిట్లు రూ.740 కోట్లు ఉన్నాయని అలాంటి విద్యాసంస్థలను చైతన్య సంస్ధలకు అప్పగించడం సరికాదన్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని ధర్మాన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేందరిపై చట్టప్రకారం అనర్హత వేటు తప్పదని ధర్మాన అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News