ఇంతబతుకు బతికి... మీడియేటర్లను నమ్ముకున్నారా?

భూమానాగిరెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు. కర్నూలు జిల్లాలో ఆయకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎవరైనా తన దగ్గరకే రావాలి గానీ… తాను మరొకరి వద్దకు వెళ్లే రకం కాదని చెబుతుంటారు. అయితే ఇప్పుడు భూమా  పరిస్థితి ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు సీనియర్ కావడంతో భూమాను అందరూ గౌరవించే వారు. జగన్‌ కూడా అన్న అని సంబోధించేవారని ఆయనే స్వయంగా కొన్నిసార్లు చెప్పుకునేవారు. అయితే టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత కథ […]

Advertisement
Update:2016-04-10 04:37 IST

భూమానాగిరెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు. కర్నూలు జిల్లాలో ఆయకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎవరైనా తన దగ్గరకే రావాలి గానీ… తాను మరొకరి వద్దకు వెళ్లే రకం కాదని చెబుతుంటారు. అయితే ఇప్పుడు భూమా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించడం లేదని అంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు సీనియర్ కావడంతో భూమాను అందరూ గౌరవించే వారు. జగన్‌ కూడా అన్న అని సంబోధించేవారని ఆయనే స్వయంగా కొన్నిసార్లు చెప్పుకునేవారు.

అయితే టీడీపీలోకి ఫిరాయించిన తర్వాత కథ అడ్డం తిరిగిందని చెబుతున్నారు. వైసీపీలో నాగపూర్‌లా బతికినోడు… టీడీపీలో చేరిన తర్వాత ”వంద పంగనూర్లలో ఈయనో పంగనూరు” అన్నట్టుగా పరిస్థితి తయారైందట. వైసీపీలో ఉన్నప్పుడు జగన్‌ను కలవాలంటే నేరుగా వెళ్లేవారు భూమా. కానీ టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదట. ఇటీవల శిల్పా మోహన్‌ రెడ్డి అనుచరుడు తులసిరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ దాడి భూమాయే చేయించాడని శిల్పా ఆరోపించారు. నేరుగా సీఎం వద్దకు వెళ్లి ఫిర్యాదుచేశారు. దీంతో కౌంటర్‌గా ఫిర్యాదు చేసేందుకు భూమా కూడా సీఎంను కలవాలని ప్రయత్నించారట. కానీ రోజుల తరబడి అపాయింట్‌మెంట్ దొరకలేదని చెబుతున్నారు. చివరకు తనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిత్వం నడిపిన నేతలను బతిమలాడుకుని సీఎం అపాయింట్‌మెంట్ సాధించారని కొన్ని ప్రతికల్లో కథనాలు వస్తున్నాయి.

ఈ పరిణామం చూసి భూమా వర్గీయులు కాసింత కలవరపాటుకు గురవుతున్నారు. ” ఏకంగా మంత్రి పదవి ఇస్తారనుకున్నాం.. కానీ ఇప్పుడు కాసింత మర్యాద ఇస్తే చాలు” అన్నట్టుగా తమ నేత పరిస్థితి తయారైందని వాపోతున్నారు. అయినా చంద్రబాబు రాజకీయం భూమాకు కొత్తా ఏంటి?. గతంలోనూ చాలా కాలం చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. చంద్రబాబు వాడి వదిలేసే రకం అని అందుకే టీడీపీని వీడి వచ్చామని స్వయంగా పలు ఇంటర్వ్యూల్లో భూమాయే చెప్పారు. కానీ తిరిగి చంద్రన్న చెంతకే చేరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News