అమ్మా కమ్యూనిస్టు !. బాబుపై ప్రేమను దాచుకోలేకపోతున్న నారాయణ!

సాధారణంగా కమ్యూనిస్టులంటే అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఉంటారు. ప్రభుత్వాలు చేసే ప్రజావ్యతిరేకవిధానాలను నిరంతరం ఎండగడుతూ ఉంటారు. పేదలు, రైతుల భూములను ఎవరైనా లాక్కుంటే అస్సలు సహించరు. రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలు, విదేశీ కంపెనీలకు దోచిపెట్టే ధోరణికి కమ్యూనిస్టులు బద్ధ వ్యతిరేకులు. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను మోసం చేయడం వామపక్ష నాయకులకు నచ్చదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజధాని పేరుతో, ఎయిర్‌పోర్టుల పేరుతో వేలాది ఎకరాలను లాక్కుంటోంది. రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ దెబ్బకు రైతులు, […]

Advertisement
Update:2016-04-10 06:35 IST

సాధారణంగా కమ్యూనిస్టులంటే అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఉంటారు. ప్రభుత్వాలు చేసే ప్రజావ్యతిరేకవిధానాలను నిరంతరం ఎండగడుతూ ఉంటారు. పేదలు, రైతుల భూములను ఎవరైనా లాక్కుంటే అస్సలు సహించరు. రైతుల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలు, విదేశీ కంపెనీలకు దోచిపెట్టే ధోరణికి కమ్యూనిస్టులు బద్ధ వ్యతిరేకులు. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను మోసం చేయడం వామపక్ష నాయకులకు నచ్చదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజధాని పేరుతో, ఎయిర్‌పోర్టుల పేరుతో వేలాది ఎకరాలను లాక్కుంటోంది. రుణమాఫీ పేరుతో ఇచ్చిన హామీ దెబ్బకు రైతులు, మహిళలు కోట్లాది మంది మోసపోయి కూర్చుకున్నారు. ఇలాంటి పాలనపై సాధారణంగా అయితే కమ్యూనిస్టు నాయకులు ఒంటికాలిపై లేస్తారు.

కానీ.. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు నారాయణ మాత్రం కాసింత ఆశ్చర్యరమైన రీతిలో స్పందించారు. చంద్రబాబుపై ప్రేమను పరోక్షంగా బయటపెట్టుకున్నారు. చంద్రబాబు బీజేపీని విడిచిపెట్టి కమ్యూనిస్టులతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీని వదిలిపెట్టమని కోరడం బాగానే ఉంది కానీ… కమ్యూనిస్టులతో జతకట్టమని కోరినట్టు కథనాలు రావడమే ఆశ్చర్యరంగా ఉంది. అంటే నారాయణ ఉద్దేశంలో చంద్రబాబు పాలన బ్రహ్మాండంగా ఉందా?. చంద్రబాబు రైతులు,మహిళలు, పేదల పట్ల ఎంతో కరుణతో పాలిస్తున్నారు… కేవలం బీజేపీతో జత కట్టడం వల్లే బాబు చెడ్డపేరు తెచ్చుకుంటున్నారని నారాయణ ఆందోళన చెందుతున్నారా?.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలన విధానాలు చూసిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని చంద్రబాబును నారాయణ ఆహ్వానించడం బహుశా కమ్యూనిస్టులకే మింగుడుపడని అంశం. కమ్యూనిస్టులకు చంద్రబాబు దగ్గరివాడా?. లేక చంద్రబాబు విధానాలకు కమ్యూనిస్టులు దగ్గరయ్యారా అన్నది నారాయణ ఇంకాస్త క్లారిటిగా చెప్పి ఉంటే బాగుండేది. అయితే నారాయణ సామాజికవవర్గం కోణంలో చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉన్నారా? అన్న అనుమానాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News