సర్దార్‌పై కుట్ర జరిగిందా?

సినిమాలు అన్నాక హిట్, ప్లాప్ కామన్. అయితే అగ్రహీరోలు నటించే సినిమాలకు నెగిటివ్ టాక్ వెంటనే బయటపడదు. మీడియా కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అయినా కనీసం ఒక వారం పది రోజుల పాటు ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజే డిజాస్టర్ అని ప్రచారంచేస్తే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అయితే పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌ సింగ్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి […]

Advertisement
Update:2016-04-09 04:24 IST

సినిమాలు అన్నాక హిట్, ప్లాప్ కామన్. అయితే అగ్రహీరోలు నటించే సినిమాలకు నెగిటివ్ టాక్ వెంటనే బయటపడదు. మీడియా కూడా భారీ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అయినా కనీసం ఒక వారం పది రోజుల పాటు ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజే డిజాస్టర్ అని ప్రచారంచేస్తే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు మునిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి.

అయితే పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌ సింగ్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగానే జరిగింది. తొలి ఆట నుంచే భారీ నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ ప్రచారం ఏ రేంజ్‌లో సాగిందంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు వెళ్లేవాడికి టేస్ట్ లేనట్టే అన్న ఫీల్ పుట్టేలా నెగిటివ్ టాక్ సృష్టించారు. . కొందరు ప్రముఖులు ఏకంగా సర్దార్ సినిమా బోల్తా పడిందంటూ ట్వీట్లు కూడా పెట్టేశారు. ఫేస్‌ బుక్‌లో అయితే పవన్ సినిమాపై పేలని పంచ్ లేదు. ఖాళీగా ఉంటే రామకోటి రాసుకోండి అంతేగానీ ఇక స్టోరీలు, స్క్రీన్‌ ప్లే రాసి పరువు తీయవద్దంటూ పవన్‌పై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు.

అయితే పవన్ సినిమా మరీ అద్బుతంగా లేకపోయినా… ఇప్పుడు ప్రచారం జరుగుతున్నంత దారుణంగా అయితే లేదన్నది పవన్ ఫ్యాన్స్ భావన. కానీ పవన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఒకవర్గం పనిగట్టుకుని ఇలా నెగిటివ్ ప్రచారం చేసిందన్నది వారి అనుమానం. పవన్ బీజేపీతో చేతులు కలుపుతారన్న వార్తలు వచ్చినప్పటినుంచి పవన్‌ టార్గెట్ అయ్యారని అనుమానిస్తున్నారు. పవన్ బీజేపీలో చేరితే కాపులంతా ఆయన వెంట నడుస్తారని అప్పుడు తమకు తీరని నష్టం తప్పదని భావిస్తున్న ఒక రాజకీయ పార్టీ శ్రేణులు ఇలా తొలి ఆట నుంచే నెగిటివ్ మౌత్ పబ్లిసిటీకి దిగాయని అనుమానిస్తున్నారు. తమ హీరో మద్దతు వల్ల తిరిగి ప్రాణం పోసుకున్న పార్టీ వారే ఇప్పుడు పవన్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News