మధుమేహం... భారత్‌ని దహిస్తోంది!
భారతీయుల జీవనశైలిలో ఎంతవేగంగా మార్పులు వస్తున్నాయో, అంతే వేగంగా వ్యాధులు తరుముకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మధుమేహం మరింత తీవ్రంగా పెరుగుతోంది. టైప్1, టైప్2, జెస్టేషనల్ డయాబెటిస్‌లు చాలా సాధారణంగా భారతీయుల్లో కనబడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి తగినంత శ్రమ…ఎంతో సింపుల్‌గా కనిపించే ఈ రెండు జాగ్రత్తలను మనం పాటించలేకపోతున్నామని పెరుగుతున్న మధుమేహ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికే మనదేశంలో 6కోట్ల 51 లక్షల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు. రెండు దశాబ్దాల కాలంలో ఈ సంఖ్య 10 […]
భారతీయుల జీవనశైలిలో ఎంతవేగంగా మార్పులు వస్తున్నాయో, అంతే వేగంగా వ్యాధులు తరుముకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా మధుమేహం మరింత తీవ్రంగా పెరుగుతోంది. టైప్1, టైప్2, జెస్టేషనల్ డయాబెటిస్‌లు చాలా సాధారణంగా భారతీయుల్లో కనబడుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, శరీరానికి తగినంత శ్రమ…ఎంతో సింపుల్‌గా కనిపించే ఈ రెండు జాగ్రత్తలను మనం పాటించలేకపోతున్నామని పెరుగుతున్న మధుమేహ గణాంకాలు చెబుతున్నాయి.
- ఇప్పటికే మనదేశంలో 6కోట్ల 51 లక్షల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు.
- రెండు దశాబ్దాల కాలంలో ఈ సంఖ్య 10 కోట్లకు చేరుతుంది.
- పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాల ముందే మధుమేహం బారిన పడుతున్నారు.
- మధుమేహం, గుండెవ్యాధులు, క్యాన్సర్, మానసిక అనారోగ్యాలు…ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థమీద 2012- 2030 మధ్య కాలంలో 126 ట్రిలియన్ల (ఒక ట్రిలియన్ అంటే పదికోట్ల రూపాయలు) రూపాయల మేరకు భారాన్ని మోపుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
- మధుమేహ బాధితులకు కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ప్రమాదం ఇతరులతో పోలిస్తే రెండు నుండి నాలుగు రెట్లు అదనంగా ఉంటుంది.
- భారత్‌లో తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల సంపాదనలో 25శాతం వరకు మధుమేహ చికిత్సకు ఖర్చుపెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.