డబ్బు సంపాదించేస్తే ఆడవాళ్లకు స్వేచ్ఛ వచ్చేసినట్టు కాదు...మహేష్ భట్!
పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించేసి, కెరీర్‌లో ముందుకు వెళుతున్నా మహిళలకు స్వేచ్ఛ వచ్చేసిందని అనలేమని బాలివుడ్ సినీ ప్రముఖుడు మహేష్ భట్ అన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు తానూ అలాగే అనుకునే వాడినని, కానీ ఆడవాళ్లు ఎమోషనల్‌గా స్వతంత్రంగా ఉండలేనంతకాలం వారు అణచివేతకు అన్యాయాలకు గురవుతూనే ఉంటారని ఆయన చెప్పారు. పైకి చాలా అధునాతనంగా, ధైర్యంగా కనిపించే తారలు, మహిళా సాధికారత గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు ఇళ్లలో పనిమనుషులకంటే తక్కువగా ఉండటం తనకు తెలుసునని ఆయన […]
పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించేసి, కెరీర్‌లో ముందుకు వెళుతున్నా మహిళలకు స్వేచ్ఛ వచ్చేసిందని అనలేమని బాలివుడ్ సినీ ప్రముఖుడు మహేష్ భట్ అన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు తానూ అలాగే అనుకునే వాడినని, కానీ ఆడవాళ్లు ఎమోషనల్‌గా స్వతంత్రంగా ఉండలేనంతకాలం వారు అణచివేతకు అన్యాయాలకు గురవుతూనే ఉంటారని ఆయన చెప్పారు. పైకి చాలా అధునాతనంగా, ధైర్యంగా కనిపించే తారలు, మహిళా సాధికారత గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పేవారు ఇళ్లలో పనిమనుషులకంటే తక్కువగా ఉండటం తనకు తెలుసునని ఆయన అన్నారు. ఎలాంటి సంపాదన లేకపోయినా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ హింసపెట్టే బంధాలను ధైర్యంగా తెంచుకున్న మహిళలు కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు. ఇంతకుముందు ఎవరూ చేయలేని సాహసాలు, పాత్రలను తెరమీద చేసిన నటీమణులు కూడా, నిజజీవితానికి వచ్చేసరికి బాధపెట్టే బంధాలను తెంచుకోలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. ఈ నెల 8న విడుదల కానుకున్న తన సినిమా లవ్‌గేమ్స్ కోసం ప్రెస్‌మీట్ పెట్టిన మహేష్‌భట్, ప్రత్యూష బెనర్జీ మరణం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తరువాత లవ్‌గేమ్స్ సినిమా దర్శకుడు విక్రమ్ భట్ మాట్లాడుతూ, మగవాడి హింసలను భరించే ఆడవాళ్లు తమ మనసులనిండా ప్రేమించినవాడిని నింపుకుంటారని, ఇలాంటివారిని మగవారు చాలా తేలిగ్గా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారని అన్నారు. ఒకసారి విపరీతంగా హింసి స్తూ, మరొకసారి క్షమాపణలు చెప్పి బతిమలాడుతూ….ఇలాంటి మగవాళ్లు, ఆడవాళ్లకు తామే తప్పుచేస్తున్నామేమో అనే భ్రమని కలిగిస్తారని విక్రమ్ భట్ అన్నారు. ఒంటరితనాన్ని భరించాల్సి వస్తుందనే భయంతో కూడా ఆడవాళ్లు బాధపెట్టే బంధాల్లోనే బతుకుతుంటారని విక్రమ్ అన్నారు.