బాబు ఒప్పుకుంటేనే రాజీనామా.. నేను నిజాయితీపరుడినని చెప్పను

వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన జ్యోతుల నెహ్రు  ఆదివారం ఒక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు.  జ్యోతుల నెహ్రు ఏం చేసినా జనం నమ్మే పరిస్థితి ఉందని చెప్పుకున్నారు. అలాంటప్పుడు 2014కు ముందు వరుసగా ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించగా… అది ఓటమి కాదని తక్కువ మెజారిటీతోనే గెలుపుకు దూరమయ్యాని చెప్పారు.  జ్యోతుల నెహ్రు అప్పులు ఎక్కువై డబ్బు కోసమే పార్టీ మారారని వస్తున్న వార్తలపైనా స్పందించారు. తాను వ్యవసాయదారుడినని అప్పులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ […]

Advertisement
Update:2016-04-03 15:06 IST

వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన జ్యోతుల నెహ్రు ఆదివారం ఒక ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. జ్యోతుల నెహ్రు ఏం చేసినా జనం నమ్మే పరిస్థితి ఉందని చెప్పుకున్నారు. అలాంటప్పుడు 2014కు ముందు వరుసగా ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించగా… అది ఓటమి కాదని తక్కువ మెజారిటీతోనే గెలుపుకు దూరమయ్యాని చెప్పారు. జ్యోతుల నెహ్రు అప్పులు ఎక్కువై డబ్బు కోసమే పార్టీ మారారని వస్తున్న వార్తలపైనా స్పందించారు.

తాను వ్యవసాయదారుడినని అప్పులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. కానీ తన ఎన్నికల్లో అభిమానులే డబ్బులు ఖర్చు పెడుతుంటారని చెప్పారు. తనకు జనం మద్దతు ఉందని అన్నారు. జనం మద్దతు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు కదా అని ప్రశ్నించగా అందుకు ఆయన సమాధానం దాటవేశారు. రాజీనామా చేయడం తనకు పెద్ద విషయం ఏమీ కాదని అయితే అది తన చేతుల్లో లేదని చెప్పారు. చంద్రబాబు చెబితే రాజీనామా చేస్తానన్నారు. చంద్రబాబు చెబితేనే చేస్తానంటున్నారు మీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా…ఒక పార్టీలో చేరిన తర్వాత నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు.

తాను నిజాయితీపరుడినని, నీతిమంతుడినని చెప్పుకోబోనన్నారు. తన కోసం కాకపోయినా తన చుట్టూ ఉన్న వారికోసమైనా తప్పు చేసి ఉంటానని వెల్లడించారు. నిజాయితీపరుడినని చెప్పుకుని జనాన్ని మోసం చేయనన్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా చాలాసార్లు తనను పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారని జ్యోతుల నెహ్రు బయటపెట్టారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News