మహిళను లోబరుచుకుని టీడీపీ నేత పైశాచిక పనులు

బెజవాడలో నేరాలు పెరిగిపోతున్నాయి. కాల్‌మనీ ప్రకంపనలు మరవకముందే ఇటీవల అమ్మాయిలను వలవేసి చర్చిఫాదర్స్‌ను  బ్లాక్‌మెయిల్ చేసిన అంశం వెలుగుచూసింది. తాజాగా రామలింగేశ్వరనగర్‌లో అధికారపార్టీకి చెందిన ఒక చోటా నేత ఆగడాలు బయటపడ్డాయి.  భర్తతో విభేదాల నేపథ్యంలో ఒక వివాహిత రామలింగేశ్వనగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. పక్క ఇంట్లో మండవ రవికాంత్ అనే టీడీపీ  నేత, రియల్టర్ తన రెండో భార్య శ్రీదేవితో కలిసి కాపురం ఉంటున్నారు. ఇంటి పక్కన నివసించే వివాహితపై కన్నేసిన రవికాంత్ ఆమెను […]

Advertisement
Update:2016-03-31 05:39 IST

బెజవాడలో నేరాలు పెరిగిపోతున్నాయి. కాల్‌మనీ ప్రకంపనలు మరవకముందే ఇటీవల అమ్మాయిలను వలవేసి చర్చిఫాదర్స్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన అంశం వెలుగుచూసింది. తాజాగా రామలింగేశ్వరనగర్‌లో అధికారపార్టీకి చెందిన ఒక చోటా నేత ఆగడాలు బయటపడ్డాయి. భర్తతో విభేదాల నేపథ్యంలో ఒక వివాహిత రామలింగేశ్వనగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. పక్క ఇంట్లో మండవ రవికాంత్ అనే టీడీపీ నేత, రియల్టర్ తన రెండో భార్య శ్రీదేవితో కలిసి కాపురం ఉంటున్నారు. ఇంటి పక్కన నివసించే వివాహితపై కన్నేసిన రవికాంత్ ఆమెను లోబర్చుకునేందుకు తన రెండో భార్య సహకారం కోరారు. తోటి స్త్రీ అన్న సంగతి మరచి ఆమె అతనికి సహకరించింది.

వివాహితలో పరిచయం పెంచుకున్న శ్రీదేవి ఆమె బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసింది. దాన్ని తీసుకెళ్లి భర్త మండవ రవికాంత్‌కు ఇచ్చింది. ఆ వీడియో సాయంతో వివాహితను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టిన రవికాంత్ చివరకు ఆమెను లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడి చేశారు.. అంతటితో ఆగక ఆమెను నగ్నంగా చేసి మెడకు బెల్టు కట్టి మోకాళ్లపై నడిపించి పైశాచిక ఆనందం పొందాడు. అంతేకాదు…

వివాహిత నుంచి లక్షల్లో సొమ్ము వసూలు చేశారు. గత నెలలో ఆమె నుంచి భారీగా బంగారం నగలు కూడా లాక్కున్నాడు. రిటైర్ అయిన వివాహిత తండ్రికి వచ్చిన ఆరు లక్షలను కూడా తీసుకున్నాడు. ఈ విషయాలు బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో వివాహిత మౌనంగా ఉండిపోయింది. చివరకు రవికాంత్ వేధింపులు తట్టుకోలేక వివాహిత తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు టీడీపీ నేత రవికాంత్, అతడి భార్య శ్రీదేవిని అరెస్ట్ చేశారు. వారు తీసిన వీడియోను, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన రవికాంత్‌ను కాపాడేందుకు ఇప్పటికే పోలీసులపై అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు మొదలైనట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News