ఈ నాటకాలు బ్యాంకుల వద్దే… మా దగ్గర నడవవ్- తలసాని

తన కుమారుడు, మరో ఇద్దరు రియల్టర్లు కలిసి అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. హోటల్ తాజ్‌ కృష్ణలోని లాంజ్‌ లో కూర్చుని మాట్లాడుకోవడాన్ని కూడా కిడ్నాప్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కొత్త పల్లి గీత రూ.11 కోట్లు తీసుకున్నారని దాన్ని చెల్లించకుండా రెండేళ్లుగా తిప్పుకుంటున్నారని తలసాని చెప్పారు. ఈ సొమ్ము చెల్లించేందుకు తాజాగా మరింత సమయం కోరిన ఎంపీ భర్త రామకోటేశ్వరరావు అంతవరకు  […]

Advertisement
Update:2016-03-31 04:27 IST

తన కుమారుడు, మరో ఇద్దరు రియల్టర్లు కలిసి అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. హోటల్ తాజ్‌ కృష్ణలోని లాంజ్‌ లో కూర్చుని మాట్లాడుకోవడాన్ని కూడా కిడ్నాప్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కొత్త పల్లి గీత రూ.11 కోట్లు తీసుకున్నారని దాన్ని చెల్లించకుండా రెండేళ్లుగా తిప్పుకుంటున్నారని తలసాని చెప్పారు. ఈ సొమ్ము చెల్లించేందుకు తాజాగా మరింత సమయం కోరిన ఎంపీ భర్త రామకోటేశ్వరరావు అంతవరకు గచ్చిబౌలిలోని తన స్థలం డాక్యుమెంట్లు పెట్టుకోవాలని ఇచ్చారన్నారు.

స్వయంగా రామకోటేశ్వరరావే తన ఇంటికి వెళ్లి డాక్యుమెంట్లు తెచ్చారని చెప్పారు. అందుకు సంబంధించిన చర్చలే తాజ్‌కృష్ణలో జరిగాయని తలసాని చెప్పారు. కిడ్నాప్ చేస్తే ఎవరైనా హోటల్ లాంజ్‌లో కూర్చోబెడుతారా అని తలసాని ప్రశ్నించారు. తప్పుడు డాక్యుమెంట్ల సాయంతో కొత్తపల్లి గీత, ఆమె భర్త కలిసి బ్యాంకులను మోసం చేశారని తలసాని అన్నారు. దానిపై సీబీఐ కేసు నమోదైన విషయం కూడా అందరికీ తెలుసన్నారు. ఈ తరహాలోనే నాటకాలు ఆడి తమకు డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని .. కానీ ఆ నాటకాలు తమ వద్ద నడవవన్నారు తలసాని. 2013లో రూ. 11 కోట్లు తీసుకుని ఇప్పటికీ చెల్లించలేదని… దాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా కోరడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. హోటల్‌లో సీసీ కెమెరాలు ఉంటాయని వాటిని తీసుకుని పరిశీలిస్తే ఏం జరిగిందో అంతా తెలిసిపోతుందన్నారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా డీజీపీని కూడా కోరారన్నారు. కిడ్నాప్‌ చేశారంటూ కొత్తపల్లి గీత పోలీసులకు ఫిర్యాదు చేశారని.. తీరా వెళ్లి చూస్తే రామకోటేశ్వరరావు ఆయన ఇంటిలోనే ఉన్నారని వెల్లడించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News