జ్యోతుల విషయంలో అలా... భూమా మ్యాటర్ లో ఇలా..!
స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తీరుపై ప్రతిపక్షం ఆగ్రహంగా ఉంది. సభలో అధికార పక్షానికి అండగా నిలబడుతున్నారని మండిపడుతున్నారు. ఇందుకు బుధవారం సభలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న జ్యోతుల నెహ్రు ఒకసారి తన స్థానంలో కాకుండా వెనుక ఉన్న వైసీపీ సభ్యుల సీట్లలో వెళ్లి కూర్చున్నారు. తోటి ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ పెట్టిన జ్యోతుల నెహ్రు… ఒక విషయంపై అక్కడి నుంచే మాట్లాడేందుకు ప్రయత్నించారు. […]
స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తీరుపై ప్రతిపక్షం ఆగ్రహంగా ఉంది. సభలో అధికార పక్షానికి అండగా నిలబడుతున్నారని మండిపడుతున్నారు. ఇందుకు బుధవారం సభలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న జ్యోతుల నెహ్రు ఒకసారి తన స్థానంలో కాకుండా వెనుక ఉన్న వైసీపీ సభ్యుల సీట్లలో వెళ్లి కూర్చున్నారు. తోటి ఎమ్మెల్యేలతో చిట్‌చాట్ పెట్టిన జ్యోతుల నెహ్రు… ఒక విషయంపై అక్కడి నుంచే మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఇందుకు అభ్యంతరం చెప్పారు. వేరే స్థానంలోకి వెళ్లి అక్కడి నుంచి మాట్లాడడం కుదరదు.. మీ స్థానంలోకి వచ్చి ప్రసంగించండి అని సూచించారు. అందుకు జ్యోతుల నెహ్రు కూడా అంగీకరించి తన స్థానంలోకి వచ్చి అక్కడి మైక్ ద్వారానే మాట్లాడారు. స్పీకర్ ఆ రోజు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే ఒక సభ్యుడు మరో స్థానంలోకి వెళ్లి మాట్లాడేందుకు రూల్స్ కూడా ఒప్పుకోవు. అయితే బుధవారం అసెంబ్లీలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.
వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పీఏసీ రిపోర్టును సభలో ప్రవేశపెట్టారు. నిజానికి ఆయన స్థానం వైసీపీ సభ్యుల మధ్యలో ఉంటుంది. కానీ భూమానాగిరెడ్డి ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేల మధ్యలో కూర్చుకున్నారు. అక్కడి నుంచే లేచి ప్రసంగించిన భూమా పీఏసీ రిపోర్టును సభ ముందుంచారు. అయితే ఇలా భూమానాగిరెడ్డి తన స్థానాన్ని వదిలిపెట్టి వచ్చి టీడీపీ సభ్యుల మధ్యలో కూర్చుని మైక్ ద్వారా మాట్లాడినా స్పీకర్ మాత్రం అభ్యంతరం చెప్పలేదు. దీన్నే వైసీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. నాడు జ్యోతుల నెహ్రు విషయంలో అభ్యంతరం చెప్పిన స్పీకర్ … భూమానాగిరెడ్డి విషయంలో ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ అధికార పక్షానికి కొమ్ముకాస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.
Click on Image to Read: