చంద్రబాబు నాపై చేయి చేసుకున్నారు- టీ మంత్రి పోచారం

తెలంగాణ అసెంబ్లీలో కరువుపై వాడీవేడిగా చర్చ జరిగింది. రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో కొందరికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారని  రేవంత్ విమర్శించారు. ఇందుకు స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు. ఇందుకు తిరిగి స్పందించిన రేవంత్… రైతు ఆత్మహత్యలకు […]

Advertisement
Update:2016-03-30 08:25 IST

తెలంగాణ అసెంబ్లీలో కరువుపై వాడీవేడిగా చర్చ జరిగింది. రైతులు పెద్దసంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్లో కొందరికి మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇందుకు స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలు తగ్గాయని చెప్పారు.

ఇందుకు తిరిగి స్పందించిన రేవంత్… రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమైతే అప్పుడు మంత్రులుగా పోచారం, తుమ్మలతో పాటు కేసీఆర్‌ కూడా కారణమేనన్నారు. ఇందుకు ప్రతిస్పందించిన పోచారం ఒక కీలక విషయం చెప్పారు. గతంలో తాము మంత్రులుగా ఉన్నా అంతా సీఎం చెప్పినట్టే జరిగేదన్నారు.

నిజాం షుగర్ష్‌ను ప్రైవేటుపరం చేయవద్దని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును చేతులు జోడించి వేడుకున్నానని చెప్పారు. చాలా సేపు బతిమలాడితే… అసహనానికి లోనైన చంద్రబాబు లేచి వచ్చి తనను కొట్టారని పోచారం వెల్లడించారు. ఈ అవమానాన్ని ఇప్పటి వరకు బయటకు చెప్పుకోలేదన్నారు. కావాలంటే వెళ్లి చంద్రబాబును అడగాలని రేవంత్‌కు సూచించారు. స్పందించిన రేవంత్ భవిష్యత్తులో కేసీఆర్ కొట్టిన దెబ్బలు కూడా చెప్పుకుంటారులే అని పోచారంను ఎద్దేవా చేశారు. మంత్రులను ముఖ్యమంత్రులు కొడుతారన్న విషయం కూడా తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. అప్పట్లో తాము మంత్రులుగా ఉన్నా అంతా సీఎం చెప్పినట్టే జరిగేదన్నారు. పోచారం వ్యాఖ్యలను కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ జీవన్ రెడ్డి తప్పుపట్టారు. నిజాం షుగర్స్‌ ప్రైవేటీకరణ ఇష్టం లేనప్పుడు రాజీనామా చేయకుండా చంద్రబాబు కేబినెట్లో ఎలా కొనసాగారని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News