వ్యాయామంతో చర్మానికి మెరుపు!
వ్యాయామం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామంతో చర్మం యవ్వనవంతంగా కాంతితో మెరుస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ వ్యాయామం చేసి చెమటోడిస్తే…అది ఒకరకంగా ఆవిరి స్నానంలా పనిచేస్తుందట. చర్మంపైని స్వేద రంధ్రాల్లో ఇరుక్కుని ఉన్న దుమ్ముధూళి కణాలు చెమటతో పాటు బయటపడతాయి. అయితే చెమట పట్టిన వెంటనే స్నానం చేసి వాటిని కడిగేయాలి. లేకపోతే తిరిగి మళ్లీ యధాతథంగా చర్మంపైన ఉండిపోతాయి. వ్యాయామంతో పట్టిన చెమటలో సహజమైన యాంటీబయోటిక్ డెర్మిసిడిన్ ఉంటుందని, ఇది ఇ కొలీ, […]
Advertisement
వ్యాయామం ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామంతో చర్మం యవ్వనవంతంగా కాంతితో మెరుస్తుందంటున్నారు వైద్య నిపుణులు.
- ప్రతిరోజూ వ్యాయామం చేసి చెమటోడిస్తే…అది ఒకరకంగా ఆవిరి స్నానంలా పనిచేస్తుందట. చర్మంపైని స్వేద రంధ్రాల్లో ఇరుక్కుని ఉన్న దుమ్ముధూళి కణాలు చెమటతో పాటు బయటపడతాయి. అయితే చెమట పట్టిన వెంటనే స్నానం చేసి వాటిని కడిగేయాలి. లేకపోతే తిరిగి మళ్లీ యధాతథంగా చర్మంపైన ఉండిపోతాయి.
- వ్యాయామంతో పట్టిన చెమటలో సహజమైన యాంటీబయోటిక్ డెర్మిసిడిన్ ఉంటుందని, ఇది ఇ కొలీ, స్టాఫిలొకోక్కస్ అనే బ్యాక్టీరియాలను హతమార్చుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
- వ్యాయామంతో శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే చర్మంలో కూడా రక్త ప్రసరణ పెరగటం ద్వారా చర్మం లోపలినుండి శుభ్రపడే ప్రక్రియ ఒకటి జరుగుతుంది. దాంతో చర్మం యవ్వనంగా కనబడుతుంది.
Advertisement