జ్యోతుల గ్రామానికి చెవిరెడ్డి…రాజకీయం వద్దన్న నెహ్రు

వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు పార్టీని వీడడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనతో వైసీపీ నేతలు నడుపుతున్న రాయబారం కూడా ఫలితాన్ని ఇస్తున్నట్టు కనిపించడం లేదు. శనివారం అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా జ్యోతుల నెహ్రు తన సొంతూరు జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఉండిపోయారు. నెహ్రుతో చర్చలు జరిపేందుకు పలువురు వైసీపీ నేతలు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నేరుగా ఆయన గ్రామానికే వెళ్లారు. చెవిరెడ్డిని బాగానే రిసీవ్ […]

Advertisement
Update:2016-03-27 05:11 IST

వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు పార్టీని వీడడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనతో వైసీపీ నేతలు నడుపుతున్న రాయబారం కూడా ఫలితాన్ని ఇస్తున్నట్టు కనిపించడం లేదు. శనివారం అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా జ్యోతుల నెహ్రు తన సొంతూరు జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఉండిపోయారు. నెహ్రుతో చర్చలు జరిపేందుకు పలువురు వైసీపీ నేతలు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి నేరుగా ఆయన గ్రామానికే వెళ్లారు. చెవిరెడ్డిని బాగానే రిసీవ్ చేసుకున్న జ్యోతుల… రాజకీయాలు మాత్రం మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించినట్టు చెబుతున్నారు. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడాల్సిందిగా కోరినా జ్యోతుల నెహ్రు సున్నితంగా తిరస్కరించారు. జగన్‌తో నేరుగానే మాట్లాడుతానని చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తం మీద జ్యోతుల నెహ్రు పార్టీ వీడడం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. మరోవైపు ద్రవ్యవినిమయ బిల్లు విషయంలో వైసీపీ ఇప్పటికే విప్ జారీ చేసింది. కాబట్టి అప్పటి వరకు ఆగుతారా లేక ముందే పార్టీ వీడుతారా అన్నది చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News