ఆయన పీఏనా? లేక ఎమ్మెల్యేనా?

మొన్నటి ఎన్నికల్లో హీరో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తారని తెలియగానే లోకల్ టీడీపీ నేతలు ఎగిరిగంతేశారు. బాలయ్య గెలిస్తే తమకు అన్ని పనులు జరిగిపోతాయని సంబరపడ్డారు. వారి కోరిక నేరవేరింది. బాలయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ వారి ఆశలు మాత్రం ఆవిరైపోయాయి. టీడీపీ నేతలు బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. కారణం బాలకృష్ణ పీఏ. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న నేతలు సైతం బాలయ్య పీఏ శేఖర్ దెబ్బకు దడుసుకుంటున్నారు. బాలకృష్ణ రెండు నెలలకోసారి హాలీడే టైమ్‌తో నియోజకవర్గానికి వస్తుంటారు. […]

Advertisement
Update:2016-03-27 07:41 IST

మొన్నటి ఎన్నికల్లో హీరో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తారని తెలియగానే లోకల్ టీడీపీ నేతలు ఎగిరిగంతేశారు. బాలయ్య గెలిస్తే తమకు అన్ని పనులు జరిగిపోతాయని సంబరపడ్డారు. వారి కోరిక నేరవేరింది. బాలయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ వారి ఆశలు మాత్రం ఆవిరైపోయాయి. టీడీపీ నేతలు బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. కారణం బాలకృష్ణ పీఏ. దశాబ్దాలుగా పార్టీలో ఉన్న నేతలు సైతం బాలయ్య పీఏ శేఖర్ దెబ్బకు దడుసుకుంటున్నారు. బాలకృష్ణ రెండు నెలలకోసారి హాలీడే టైమ్‌తో నియోజకవర్గానికి వస్తుంటారు. మిగిలిన సమయంలో హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన పీఏనే అనధికారికంగా పనిచేస్తున్నారు.

ఏదో ప్రజల సమస్యలు తీర్చేందుకు పనిచేస్తే పర్వాలేదు…. కానీ పీఏ కూడా రాజకీయనాయకుడు తరహాలో ప్రవర్తిస్తున్నాడని టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. తాజాగా శేఖర్ బాధితుల జాబితాలోకి హిందూపురం మున్సిపాలిటీ కీలక నేత చేరారు. మున్సిపాలిటీతో నీకేం సంబంధం… రూరల్ మండలాల సంగతి చూసుకో అని గతంలో ఒక సారి సదరు నేత హెచ్చరించడాన్ని మనసులో పెట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా టీడీపీలో వర్గాలను సృష్టించారు బాలయ్య పీఏ. ఇక్కడే కాదు ఏ ఊరిలోనైనా, మండలంలోనైనా తనకు అనుకూలంగా ఉండకపోతే పీఏ శేఖర్ ఇలాగే వర్గ విబేధాలను సృష్టిస్తున్నాడు.

హిందూపురం మున్సిపాలిటీ బకాయిలు రద్దు చేయాలని ఇటీవల మంత్రి నారాయణకు బాలయ్య ఒక లేఖ రాశారు. దానిపై అంతకు మించి ఎలాంటి నిర్ణయం లేదు. ఇదే అదనుగా పీఏ శేఖర్ వర్గానికి చెందిన టీడీపీ నేతలు బాలయ్య గెస్ట్ హౌజ్‌లోనే ప్రెస్‌ మీట్ పెట్టి పన్నులు కట్టవద్దని హిందూపురం ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో రావాల్సిన పన్నులు ఆగిపోయాయి. డబ్బులు వసూలు కాకపోవడంతో ఏ పనిచేయాలో మున్సిపాలిటీ కీలక నేతకు అర్ధం కాలేదు. ఇలా సదరు నేతకు చెడ్డపేరు తెచ్చేందుకు అసలు పన్నుల మాఫీపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకముందే పన్నులు కట్టవద్దని పిలుపునిచ్చినట్టు భావిస్తున్నారు. ఈ పరిణామంపై మున్సిపాలిటీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నేతల మధ్య వివాదాల నేపథ్యంలో పన్నులు కట్టవద్దని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు పేరుకుపోతే చివరకు అది కూడా మరో రైతు రుణమాఫీలా తయారవుతుందని ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద పీఏ వ్యవహారంపై బాలకృష్ణ కొంచెం దృష్టి సారించాలని లేకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News