రెడ్లను చంద్రబాబు చెంతకు చేర్చే పనిలో జేసీ ఉన్నారా?

జేసీ దివాకర్ రెడ్డికి జగన్‌ అంటే అభిమానామో లేక దురాభిమానమో గానీ జగన్‌ తీరును ఎప్పటికప్పుడు అంచనా వేసి మీడియా ముందుకు వచ్చి రిపోర్ట్‌ చేస్తున్నారు. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే తొలుత ‘’మా జగన్‌’’ అంటూ మొదలుపెడుతుంటారు జేసీ. అదే సమయంలో మా వాడి పనితీరు బాగోలేదు అంటూ నెగిటివ్ టచ్‌లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా జగన్‌ తీరుపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జేసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారంటే…’’  మావాడు ఉన్నాడు. ఎవరు?. జగన్‌. వాడి […]

Advertisement
Update:2016-03-26 15:16 IST

జేసీ దివాకర్ రెడ్డికి జగన్‌ అంటే అభిమానామో లేక దురాభిమానమో గానీ జగన్‌ తీరును ఎప్పటికప్పుడు అంచనా వేసి మీడియా ముందుకు వచ్చి రిపోర్ట్‌ చేస్తున్నారు. జగన్ గురించి మాట్లాడాల్సి వస్తే తొలుత ‘’మా జగన్‌’’ అంటూ మొదలుపెడుతుంటారు జేసీ. అదే సమయంలో మా వాడి పనితీరు బాగోలేదు అంటూ నెగిటివ్ టచ్‌లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా జగన్‌ తీరుపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద జేసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆయనేమన్నారంటే…’’ మావాడు ఉన్నాడు. ఎవరు?. జగన్‌. వాడి వల్ల మేమంతా దెబ్బలుతింటున్నాం. ముఖ్యంగా రెడ్డి కులస్తులు. జగన్‌ పార్టీ పరిస్థితి ఏమంతా బాగోలేదు. ఉంటాడా?, ఊడుతాడా?, బయట ఉంటాడా?, లోపలికి వెళ్తారా? అన్నది అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈ విషయంలో మా రెడ్లంతా చస్తున్నారు. మా రెడ్లు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. అందుకే మా రెడ్లకు చెప్పా… ఎందుకురా త్రిశంకు స్వర్గంలో అల్లాడి చచ్చిపోతారని!. ఈ రాష్ట్రానికి దిక్కూ దివానం లేదు’’ అని జేసీ అన్నారు.

జగన్‌ పార్టీకి రెడ్డి సామాజికవర్గం మద్దతుగా ఉన్న మాట వాస్తవమే. కానీ అదే సమయంలో జగన్‌ వల్ల రెడ్లు ఇబ్బంది పడుతున్నారని జేసీ చెప్పడం కాస్త ఆసక్తికరంగానే ఉంది. వయసులో చిన్నవాడైనా ఒంటరిగా చంద్రబాబుతో పోరాడుతున్నారు జగన్. రెడ్డి సామాజికవర్గానికి చెందిన జేసీలాంటి సీనియర్లు మాత్రం చంద్రబాబు పార్టీలో చేరిపోయారు. అలా రెడ్డి నాయకుల మధ్యే ఐక్యత లేకుండా.. కేవలం జగన్‌ వల్లే రెడ్లంతా దెబ్బతింటున్నారని జేసీచెప్పడం కాస్త ఆసక్తికరంగానే ఉంది. పైగా త్రిశంకు స్వర్గంలో ఎంతకాలం బతుకుతారని రెడ్డి నేతలకు చెప్పినట్టు జేసీ వెల్లడించారు. అంటే రెడ్లంతా జగన్ ను వదిలేసి చంద్రబాబు దగ్గర చేరిపోవాలని జేసీ మెసేజ్ ఇస్తున్నారు కాబోలు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News