కమ్మ కులం అయితే గొప్పేంటి…? సిద్ధార్థ కాలేజ్ లో హెచ్చరించారు...

హైద‌రాబాద్‌ని చంద్రబాబు నాయుడే అభివృద్ధి ప‌రిచారని కొందరు పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు న‌టుడు జ‌గ‌ప‌తి బాబు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. హైద‌రాబాద్‌ని ప్ర‌పంచ‌ప‌టం మీద నిలిపింది చంద్ర‌బాబే అన్నారు. ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు మాట్లాడారు.  గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు ఎమ్ఎల్ఎ టికెట్ ఆఫ‌ర్ చేశార‌ని, కానీ త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టంలేకే కాద‌న్నాన‌ని అన్నారు. కానీ  భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ అలాంటి అవ‌కాశం వ‌స్తే మాత్రం,  అప్ప‌టి త‌న ఆలోచ‌న‌లు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈ విష‌యంలో […]

Advertisement
Update:2016-03-26 11:04 IST

హైద‌రాబాద్‌ని చంద్రబాబు నాయుడే అభివృద్ధి ప‌రిచారని కొందరు పదేపదే చెబుతుంటారు. ఇప్పుడు న‌టుడు జ‌గ‌ప‌తి బాబు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చారు. హైద‌రాబాద్‌ని ప్ర‌పంచ‌ప‌టం మీద నిలిపింది చంద్ర‌బాబే అన్నారు. ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు మాట్లాడారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు ఎమ్ఎల్ఎ టికెట్ ఆఫ‌ర్ చేశార‌ని, కానీ త‌న‌కు రాజ‌కీయాలంటే ఇష్టంలేకే కాద‌న్నాన‌ని అన్నారు. కానీ భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ అలాంటి అవ‌కాశం వ‌స్తే మాత్రం, అప్ప‌టి త‌న ఆలోచ‌న‌లు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఈ విష‌యంలో త‌న నిర్ణ‌యం మార‌వ‌చ్చ‌న్నారు. టాలీవుడ్‌లో త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి బాల‌కృష్ణ అని, ఆయ‌న‌కూడా త‌న‌లాగే ముక్కుసూటిగా మాట్లాడ‌తార‌ని జ‌గ‌ప‌తిబాబు తెలిపారు. అయితే ఇండ‌‌స్ట్రీలో ప్ర‌తి న‌టుడు త‌న‌కు న‌చ్చుతాడ‌ని, తాను అంద‌రితోనూ క‌లిసి న‌టించాల‌నుకుంటున్నాన‌ని జ‌గ‌ప‌తిబాబు త‌న మ‌న‌సులో మాట చెప్పారు.

కులాలపై జగపతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కుల రాజ‌కీయాలంటే త‌న‌కు అస‌హ్య‌మంటూ, మ‌న‌దేశం కుల‌పిచ్చి నుండి పూర్తిగా బ‌య‌ట‌ప‌డాల‌న్నారు. కమ్మవారు అయినంత మాత్రాన గొప్పేంటని ఆయన ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం విజయవాడ సిద్ధార్థ కాలేజ్‌కు వెళ్లానని అక్కడి ఫంక్షన్‌లో కమ్మ కులం గురించి మాట్లాడుతానని చెప్పగానే ప్రిన్సిపల్ వద్దని వారించారని చెప్పారు. కాలేజ్‌లో కమ్మవారిదే డామినేషన్‌ అని నెగిటివ్‌గా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా చేయవచ్చని హెచ్చరించినట్టు చెప్పారు. కానీ తాను మాత్రం కులాలకు వ్యతిరేకంగానే మాట్లాడానన్నారు. ‘’మీ ప్రిన్సిపల్ ఇలా అన్నారయ్యా… ఇప్పుడు మీరేం చేస్తారు. చంపేస్తారా” అని ప్రశ్నించగా విద్యార్థులంతా చప్పట్లు కొట్టారని జగపతి గుర్తు చేశారు.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ తన కులం వారి నుంచి ఎదురైన అనుభవాలను జగపతి నేరుగా బయటకు చెప్పారు. తన కూతురిని విదేశీ వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడాన్ని కమ్మ కులంలోని చాలా మంది వ్యతిరేకించారని చెప్పారు. కొందరు డ్రగ్ కేసులో తన అల్లుడిని ఇరికించి పెళ్లి జరగకుండా చేసేందుకు కుట్ర చేశారని చెప్పారు. కానీ వారి ఆటంకాలను లెక్కచేయకుండా ప్రేమించిన వ్యక్తికే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశానన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News