చంద్రబాబూ… నేను తిరుపతి బస్టాండ్‌లో లడ్డూలు అమ్ముకోలేదు… ఐయామ్ టాప్ హీరోయిన్
తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని టీడీపీ నేతలు చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దగ్గర రాజకీయ భిక్ష పెట్టించుకోవడానికి తానేమీ తిరుపతి బస్టాండ్‌లో తిరుమల లడ్డులు అమ్ముకుని బతకలేదని అన్నారు. తాను అప్పట్లో టాప్ హీరోయిన్‌నని చెప్పారు. తన వెంట పడి చంద్రబాబే పార్టీలో చేర్చుకున్నారన్నారు. వెంటపడి టీడీపీ వాళ్లు ప్రచారానికి తీసుకెళ్లారన్నారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ఒక్క రూపాయి ఇచ్చారేమో చెప్పాలన్నారు. కనీసం ఏ సాయమన్నా చేశారేమో […]
తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబేనని టీడీపీ నేతలు చెప్పడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు దగ్గర రాజకీయ భిక్ష పెట్టించుకోవడానికి తానేమీ తిరుపతి బస్టాండ్‌లో తిరుమల లడ్డులు అమ్ముకుని బతకలేదని అన్నారు. తాను అప్పట్లో టాప్ హీరోయిన్‌నని చెప్పారు. తన వెంట పడి చంద్రబాబే పార్టీలో చేర్చుకున్నారన్నారు. వెంటపడి టీడీపీ వాళ్లు ప్రచారానికి తీసుకెళ్లారన్నారు. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు ఒక్క రూపాయి ఇచ్చారేమో చెప్పాలన్నారు. కనీసం ఏ సాయమన్నా చేశారేమో చెప్పాలన్నారు.. టీడీపీ తరపున గతంలో తాను ప్రచారం చేయని ఊరు లేదన్నారు. ఇప్పుడు తనను విమర్శిస్తున్న టీడీపీ మహిళా నేతల కంటే ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించానన్నారు. మహిళల పక్షాన ఎక్కడికైనా వెళ్లిపోరాడిన చరిత్ర తనదన్నారు. రోజాను తిట్టడం వల్ల మంత్రి పదవులు వస్తాయని టీడీపీ నేతలనుకుంటే అలాగే చేసుకోవాలన్నారు.
తాను అసెంబ్లీపై యుద్ధం ప్రకటించానని స్పీకర్ అంటున్నారని… కానీ తానెప్పుడు సభపై యుద్ధం ప్రకటించలేదన్నారు. సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత వివరణ ఇచ్చుకునేందుకు స్పీకర్ కార్యాలయానికి వెళ్తే మార్షల్స్ తో గెంటివేయించారని ఆ పరిస్థితిలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లక మరేం చేయాలని ప్రశ్నించారు.
Click on Image to Read: